ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో ఎవడు ఎప్పుడు ఎలా పోతాడో ఎవడికి తెలియదు. అందుకే ఉన్నప్పుడే అనుకున్నది అనుభవించాలి. ఇదీ నేటి లోకం తీరు. ఇదే సూత్రాన్ని మెగా హీరో అల్లు అర్జున్ ఫాలో అవుతున్నట్టున్నాడు. ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్‌కు ఏకంగా 65 వేలు విలువ చేసే కాస్ట్లీ టీషర్ట్‌ని ధరించి షాకిచ్చిన అల్లు అర్జున్ తన కోసం ప్రత్యేకంగా సకల సదుపాయాలు గల ఓ కారవాన్‌ను సిద్ధం చేయించుకుంటున్నాడని తెలిసింది. టాలీవుడ్‌లో వున్న స్టార్ హీరోలకు ప్రతి ఒక్కరికి ఒక్కో కారవాన్ వున్న విషయం తెలిసిందే.
వాటిని ఎవరికి తగ్గ టేస్ట్‌తో వాళ్లు తమకు కావాల్సిన రీతిలో ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. కొత్త కొత్త హంగులతో మాడిఫై చేయించుకుంటున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అందరి స్టార్ లకు పూర్తి భిన్నంగా అత్యంత లగ్జరీగా తన కారవాన్‌ను సిద్ధం చేయిస్తున్నాడట. దీని కోసం ఏకంగా అల్లు అర్జున్ 7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. లగ్జరీ విషయంలో ఏమాత్రం తగ్గని మెగా హీరో ఆ మొత్తం ఖర్చుచేయడానికి ఎక్కడా వెనుకాడటం లేదట.
అల్లు అర్జున్ లగ్జరీ విషయంలో ఎంత ఖర్చు చేస్తాడనటానికి అతనికి వున్న నాలుగు అత్యంత ఖరీదైన కార్లే జస్ట్ ఎక్జాంపుల్. రేంజ్ రోవర్ 64.65 లక్షలు, బీఎం బబ్ల్యూ 80 లక్షలు, ఆడీ ఏ7 85.88 లక్షలు, జాగ్వార్ ఎక్స్ జేఎల్ కోటీ 20 లక్షలు, దాదాపు వంద కోట్లు విలువచేసే ఇల్లు.