రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఎదురైన ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ ముందుకు పోతున్నాడు. మొన్నటికిమొన్న ఏపీ ఎలక్షన్స్ టైంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదల ఆపాలంటూ వేసిన పిటిషన్ కి ఈసీ క్లిన్ చిట్ ఇచ్చి మరీ.. సినిమాని విడుదల చెయ్యొచ్చని చెప్పింది. అసలు సెన్సార్ కూడా చెయ్యనని చెప్పిన సెన్సార్ బోర్డు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చెయ్యక తప్పలేదు. మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిరభ్యంతరంగా విడుదల చేసుకోవచ్చని ఈసీ చెప్పినట్లుగా ఆ సినిమా నిర్మాత చెప్పాడు. మరి అసలు ఈనెల 29 న విడుదలవుతుందా? అని చాలామందికి వచ్చిన డౌట్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ చేసేసుకుంది. వివాదాలతో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కనీసం సెన్సార్ దగ్గర అయినా ఆగుతుంది అనుకుంటే... ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తయ్యింది. ట్రైలర్ లో చూపించినట్లుగా సినిమా ఉందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లిన్ యు సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డు. మరి ఎన్నో వివాదాలు మూటగట్టుకుంటుంది అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్చి 29 న విడుదలకు సిద్దమవుతుంది. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిలా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. సినిమాకి క్లిన్ యు సర్టిఫికెట్ రావడం అంటే.. సినిమాలో ఎలాంటి వివాదాలకు చోటు లేదేమో.. అందుకే సెన్సార్ వారు క్లిన్ యు ఇచ్చేసింది.