Advertisementt

మాయ్యా.. మాయ్యా.. చైతూ వచ్చాడయ్యా!!

Wed 27th Mar 2019 08:42 PM
naga chaitanya,samantha,divyansha,majili movie,maayaa maayya song,released  మాయ్యా.. మాయ్యా.. చైతూ వచ్చాడయ్యా!!
Maayya Maayya Video Song Released from Majili మాయ్యా.. మాయ్యా.. చైతూ వచ్చాడయ్యా!!
Advertisement
Ads by CJ

‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివనిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. పెళ్లికాకముందు నాగచైతన్యతో ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్‌సూర్య వంటి చిత్రాలలో కలిసి నటించిన నాగచైతన్య, సమంతలు వివాహం అనంతరం కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులందరి చూపు ఈ చిత్రంపై ఉంది. ఇది భార్యాభర్తల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్‌తో నిండిన చిత్రం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య, సమంతలు భార్యాభర్తలుగా నటిస్తుండగా, దివ్యాన్ష్‌ కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటిస్తూ ఉండటం విశేషం. మరి ఈ చిత్రంలో దివ్యాన్ష్‌ పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగామారింది. 

ఇక ఈ మూవీ నాటి మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో ఉండనుందని అంటున్నారు. మధ్యతరగతి యువకునిగా ఇందులో నటిస్తున్న నాగచైతన్య క్రికెటర్‌ అవతారంలో కూడా కనిపిస్తూ ఉండటం విశేషం. మొత్తానికి యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ ‘మజిలీ’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానున్న ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌లో మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్యూన్స్‌ని గోపీసుందర్‌ అందిస్తుండగా, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ని థమన్ అందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడే కొద్ది యూనిట్‌ కూడా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. 

తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాయ్యా.. మాయ్యా’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. చైతు పాత్ర స్వరూప, స్వభావాలను ఆవిష్కరించేలా ఆ పాటలోని సాహిత్యం కొనసాగుతోంది. చైతు తన స్నేహితులతో ఆడిపాడే దృశ్యాలతో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం తనకి ‘శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి ఫ్లాప్‌ చిత్రాల అనంతరం మంచి హిట్‌ని ఇస్తుందని, అందునా సమంత కలిసి నటిస్తుండటం వల్ల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చైతు ఉన్నాడు. ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్‌ సాంగ్స్‌ సినిమాపై మంచి అంచనాలను పెంచాయనే చెప్పాలి. 

Click Here For song

Maayya Maayya Video Song Released from Majili:

Majili Movie Maayya Maayya song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ