Advertisementt

RRR: ఉత్తరభారతంలోకి వెళుతోంది

Sat 30th Mar 2019 12:18 PM
alia bhatt,joins,rrr movie,shooting,rajamouli,ram charan,ntr  RRR: ఉత్తరభారతంలోకి వెళుతోంది
RRR Movie Latest Update RRR: ఉత్తరభారతంలోకి వెళుతోంది
Advertisement
Ads by CJ

రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తాను తీస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీ అయిపోయాడు. వేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడు. సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా నటిస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌లపై పలు సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఇక ఇందులో అజయ్‌దేవగణ్‌ కూడా మరో స్వాతంత్య్ర సమరయోధుని పాత్రలను పోషిస్తున్నాడు. కానీ ఈయనది ఉత్తరాదికి చెందిన వీరుని పాత్ర కావడం విశేషం. ఇక చరణ్‌కి జోడీగా నటిస్తోన్న సీత పాత్రధారి అలియాభట్‌ కూడా త్వరలో ప్రారంభం కానున్న ఉత్తరాది షెడ్యూల్‌ షూటింగ్‌లో జాయిన్‌ కానుంది. 

ఇక సంజయ్‌దత్‌, వరుణ్‌ధావన్‌ల పాత్రలు ఏమిటో తెలియాల్సివుంది. ఇక ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న విదేశీ బ్యూటీ డైసీ ఎగ్డార్‌జోన్స్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈమె కూడా త్వరలో షూటింగ్‌లో పాల్గొననుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా కీలకపాత్రను పోసిస్తూ ఉండటం విశేషం. ఇక ఇందులో ఇంకా పలువురు ప్రాముఖ్యం ఉన్న నటీనటులు ప్రధానమైన పాత్రలను పోషిస్తు ఉన్నారు. అలాంటి నటుల్లో పలువురు పరభాషా నటులు కూడా ఉండటం విశేషం. 

ఇక ఈ చిత్రం ట్యూన్స్‌ని కీరవాణి దాదాపు పూర్తి చేశాడని అంటున్నారు. గతంలో రాజమౌళి చిత్రం అంటే ఎంత కాలం షూటింగ్‌ జరుగుతుంది? ఏ తేదీన విడుదల అవుతుంది అని చెప్పలేం. ప్రతి పాత్రను, సీన్‌ని జక్కన్నలా చెక్కడం రాజమౌళికి అలవాటు. కానీ ఈసారి మాత్రం 25శాతం షూటింగ్‌ కాకమునుపే 2020 జూలై 30న విడుదల అని గ్యారంటీగా ప్రకటించడం చూస్తుంటే రాజమౌళి వర్కింగ్‌ స్టైల్‌ మారిందనే చెప్పాలి. 

RRR Movie Latest Update:

Alia Bhatt Joins RRR movie shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ