Advertisementt

‘సీత’ టీజర్‌ను భారీ ఎత్తున వదిలారు

Mon 01st Apr 2019 10:19 PM
sai srinivas,kajal,sita movie,teaser,release,vr siddartha engineering college  ‘సీత’ టీజర్‌ను భారీ ఎత్తున వదిలారు
Sita Teaser Released ‘సీత’ టీజర్‌ను భారీ ఎత్తున వదిలారు
Advertisement
Ads by CJ

యువ‌క‌థానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ తేజ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘సీత‌’. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నారా చోప్రా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌బోతున్నారు. విజ‌య‌వాడ‌లోని వి.ఆర్‌.సిద్ధార్థ ఇంజ‌నీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ వేడుక‌లో 35000 మంది స్టూడెంట్స్ పాల్గొన‌డం విశేషం. 

ఈ ఫంక్ష‌న్‌లో బెల్లంకొండ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ స్ట‌న్నింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ .. అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫామెన్స్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచాయి. ఈ ఫంక్ష‌న్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, తేజ‌, అనీల్ సుంక‌ర‌, కిషోర్ గ‌రిక‌పాటి, పాయ‌ల్ రాజ్‌పుత్‌, అనూప్ రూబెన్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. యూనిట్ స‌భ్యులంద‌రూ ‘సీత‌’ స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Click Here For Teaser

Sita Teaser Released:

Sita Teaser Launched at VR Siddhartha Engineering College