‘జెంటిల్‌మెన్, సమ్మోహనం’ సినిమాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మల్టీస్టారర్ మూవీని దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో కాగా.. హీరో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నాడు. అయితే నాని నెగెటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ గా ‘వ్యూహం’ అనే టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లుగా గత రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని.. అతనికి జోడిగా అదితి రావు నటించే అవకాశమున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న నానికి కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఉండబోతుందని.. ఆ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత అని అంటున్నారు. సమంత, నాని కలిసి ‘ఈగ’ సినిమాలో నటించారు ఆ సినిమా సూపర్ హిట్. ఇక నాని సమంత కలిసి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’లోనూ నటించాడు ఆ సినిమా కూడా హిట్టే. మరి ఇప్పుడు నిజంగానే ఈ సినిమాలో ఈ ఇద్దరు జోడికడితే ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్లే. అయితే ఈ మధ్యన గ్లామర్ పాత్రలను తగ్గించి.. నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్ చేస్తున్న సమంతని ఒకవేళ ఇంద్రగంటి కలిసి కథ చెప్పి ఒప్పిస్తే.. సమంత ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.