చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష!
2010లో ‘సలీం’ సినిమా విషయంలో వైవిఎస్ చౌదరి, మోహన్ బాబు పై పెట్టిన చెక్ బౌన్స్ కేసు.. ఇప్పటివరకు ఎర్రమంజిల్ కోర్టులో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ నేడు తుది తీర్పుకు నోచుకుంది. చెక్ బౌన్స్ కేసులో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ని A1 ముద్దాయిగా చేర్చిన పోలీస్‌లు, మోహన్ బాబుని A2 ముద్దాయిగా చేర్చారు. అయితే ఈమధ్యలో మోహన్ బాబు తరుపు న్యాయవాదులు, వైవిఎస్ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబును నిందితుడుగా ప్రకటిస్తూ.. చెక్ బౌన్స్ కేసులో ఒక ఏడాది పాటు జైలు శిక్షను విధించడమే కాదు.. 41.75 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుతో మోహన్ బాబు షాకయినట్లుగా తెలుస్తోంది.