ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల అంటూ గత ఏడాది మహర్షి సినిమా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది మొదట్లో మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25 కి వెళ్లిందని స్వయానా మహర్షి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు. కారణం మహర్షి సినిమా షూటింగ్ ని వంశీ నత్తనడక నడిపిస్తున్నాడని... అలాగే కొన్ని సీన్స్ ని వంశీ పైడిపల్లి రీ షూట్స్ చేస్తున్నాడని అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుందని అన్నారు. ఇక మొన్నీ మధ్యన మహర్షి సినిమాని మహానటి సెంటిమెంట్ తో మే 9 న విడుదల చేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు.
కానీ ఇప్పటివరకు మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలు కాగా... ఎడిటింగ్ కూడా శరవేగంగా జరుగుతన్న మహర్షి మూవీ షూటింగ్ వంశీ పైడిపల్లి వలన లేట్ కాలేదని.. మహేష్ వలనే లేట్ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే మహర్షి సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చి మహేష్ కమర్షియల్ యాడ్ షూట్స్ కోసం వెళుతున్నాడని.. అందుకే మహర్షి సినిమా షూటింగ్ ఇలా లేట్ అవుతూ రావడం.. సినిమా విడుదల కూడా పోస్ట్ పోన్ అవడం జరిగిందని అంటున్నారు. మొన్నామధ్యన ఒక యాడ్ షూట్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన మహేష్.. తాజాగా మరో యాడ్ షూట్ కోసం మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నాడట. మరి కేవలం మహేష్ ఇలా మహర్షి షూటింగ్ కి బ్రేకిచ్చి.. యాడ్ షూట్స్ అంటూ వెళ్లడంతో సినిమా షూటింగ్, విడుదల అన్ని లేట్ అయ్యాయనే టాక్ వినబడుతుంది.