Advertisementt

అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్

Sat 06th Apr 2019 01:28 PM
allu arjun,trivikram,movie,first look,release,april 8  అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్
Good News to Allu Arjun Fans అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఓపెనింగ్ అయితే అయ్యింది కానీ, మధ్యలో సుకుమార్‌తో బన్నీ మూవీ అని ప్రకటన రావడంతో ఈ మూవీ ఎప్పుడు తెరపైకి వస్తుందో అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఓపెనింగ్ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఎటువంటి సమాచారం చిత్రయూనిట్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నింటికి చెక్ పెడుతూ.. చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను విడుదల చేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 24 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్ కూడా ఇప్పటి వరకు ఏ మూవీలో కనిపించనటువంటి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని అంటున్నారు. లుక్స్ విషయంలో ఇప్పటికే ఎన్నో రకాలుగా పరిశీలించిన టీమ్ చివరికి ఓ లుక్‌ని ఫైనల్ చేశారట. ఈ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారని మెగా సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. 

Good News to Allu Arjun Fans:

Allu Arjun and Trivikram Movie First look on April 8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ