ప్రచారానికి రావడం లేదు కానీ.. మా మద్దతు, సపోర్ట్ జనసేన, పవన్ కల్యాణ్ మరియు నాగబాబు గారికే అంటూ ఈ మధ్య బన్నీ ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే బన్నీ మరో లేఖ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. బన్నీ వైసీపీ తరపున నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటు వేయమని పిలుపునివ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. శిల్పారవిచంద్రారెడ్డిని గెలిపించాలని బన్నీ రాసిన లేఖలో ఆయన సన్నిహిత స్నేహితునిగా పేర్కొన్నాడు. శిల్పా రవిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి శుభం కలగాలని బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. నాకు చాలా ఏళ్లుగా ఆయన మంచి స్నేహితుడు. జెంటిల్‌మేన్. రాజకీయ పార్టీల పరంగా చూస్తే తాము వేర్వేరు పార్టీలకు చెందిన వారిమని, మా రాజకీయ భావజాలం కూడా భిన్నం. కానీ స్నేహం కోసం తాను ఆయనికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని బన్నీ పేర్కొన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం, షాకవడం జనసేనికుల వంతైంది.