Advertisementt

అప్పటి వరకు ‘మజిలీ’దే హవా..!

Mon 08th Apr 2019 03:23 PM
majili movie,hit,prema katha chitram 2,fail,box office  అప్పటి వరకు ‘మజిలీ’దే హవా..!
NO Competition to Majili Movie at Box Office అప్పటి వరకు ‘మజిలీ’దే హవా..!
Advertisement
Ads by CJ

జనవరిలో ఎఫ్ 2 హిట్. ఫిబ్రవరిలో ఒక్క హిట్ కూడా లేదు. మార్చి 1 న 118 హిట్. ఇక మళ్ళీ ఏప్రిల్ 5 వరకు ఎలాంటి సినిమా బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోయింది. కానీ ఏప్రిల్ 5 న మాత్రం మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన మజిలీ సినిమా బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. మొన్న శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా మంచి ఓపినింగ్స్ ని రాబట్టింది. నాగ చైతన్య కెరీర్ లో మొదటిరోజు సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచింది మజిలీ సినిమా. అలాగే చైతు నటనకు, శ్రావణిగా సమంత నటనకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారు అంటే... మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు కొల్లగొట్టింది మజిలీ. మరి పాజిటివ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో మజిలీ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూలు చేసే కలెక్షన్స్ గురించే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

మజిలీ పోటీగా దిగిన ప్రేమకథా చిత్రం 2 మజిలీ కలెక్షన్స్ ని ఏ మాత్రం ప్రభావితం చెయ్యలేకపోయింది. నిన్న శనివారం విడుదలైన ఈ చిత్రం మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక క్రిటిక్స్ కూడా ప్రేమకథా చిత్రం 2 కి అట్టర్ ప్లాప్ రేటింగ్ అంటే... 5 కి 0.5, 1.0 రేటింగ్స్ ఇచ్చారు అంటే ఆ సినిమా ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. 

మరి మజిలీ సినిమాని ప్రేమకథా చిత్రం ఏవిధంగా ప్రభావితం చెయ్యలేక చేతులెత్తేసింది. ఈవారం మొత్తం మజిలీ సోలోగా దున్నేయ్యడం ఖాయమే. ఇక ఏప్రిల్ 12 సాయి ధరమ్ తేజ్ - మేఘ ఆకాష్ ల చిత్రలహరి థియేటర్స్ లోకి వచ్చే వరకూ మజిలీ హవానే థియేటర్స్ లో కొనసాగుతుంది. చిత్రలహరికి టాక్ బావుంటే మజిలీ కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. అదే టాక్ తేడా కొడితే మరో వారం మజిలీదే.

NO Competition to Majili Movie at Box Office:

Prema katha Chitram 2 Failed at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ