Advertisementt

‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి.. వచ్చేది అప్పుడే!

Tue 09th Apr 2019 04:17 PM
saitej,chitralahari,censor completed,release,april 12  ‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి.. వచ్చేది అప్పుడే!
Chitralahari Censor Completed ‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి.. వచ్చేది అప్పుడే!
Advertisement
Ads by CJ

‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి.. ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మాతలు. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా 

నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందిన చిత్రలహరి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సాయి తేజ్ గారు సరికొత్త లుక్, నటనతో ఈ సినిమాలో మెప్పిస్తారు. ఆయన డేడికేషన్ ఏంటో  ఈ సినిమాలో మరోసారి చూడొచ్చు. 

కిషోర్ తిరుమలగారు మనసుని హత్తుకునేలా బ్యూటీఫుల్ ఎమోషన్స్ తో ‘చిత్రలహరి’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి పాత్రను అమేజింగ్ గా పిక్చరైజ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ప్రేక్షకులు చూడాల్సిన సినిమా. సక్సెస్ విలువను, దాని కోసం ఎంత కష్టపడాలనే విషయాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. అన్నీ పాటలు బావున్నాయంటున్నారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ట్రైలర్ కు కూడా ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను రీచ్ అయ్యేలా సినిమా ఉంటుంది. అలాగే నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్ తో పాటు అమేజింగ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు.  ఏప్రిల్ 12న సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.

Chitralahari Censor Completed:

Chitralahari Movie Ready to Release