శివ నిర్వాణ నిన్ను కోరి సినిమాతో ఎటువంటి అంచనాలు లేకుండా అదరగొట్టే హిట్ కొట్టాడు. నాని - నివేత - ఆదిల మధ్యన ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అందమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిన్నుకోరి సినిమాని అందించాడు. మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమాతో శివ నిర్వాణ ద్వితీయ విజ్ఞాన్ని దాటుతాడా అని సోషల్ మీడియాలో రేజ్ అయిన ప్రశ్నలకు తన మజిలీ సినిమా హిట్ తో సమాధానం చెప్పాడు. మరి శివ నిర్వాణ మేకింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మజిలీ సినిమాని మనసులకు హత్తుకునేలా శివ మలిచిన తీరుకి ప్రేక్షకులు ఎంతెలా బ్రహ్మరధం పడుతున్నారో మజిలీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ సాక్ష్యం.
మజిలీ సినిమాని ఫస్ట్ హాఫ్ లో కెరీర్ ప్రేమ అంటూ తిరిగే కుర్రాడు .. సెకండ్ హాఫ్ లో ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి, సంసారంలో ఎలా కుదురుకున్నాడనే విషయాన్నీ ఎంతో లాజిక్ గా చూపించాడు. నాగ చైతన్య, దివ్యంకాతో రొమాంటిక్ గా రెచ్చిపోయి..... ఇష్టం లేని భార్య సమంతతో సర్దుకుపోలేక తాగుడుకు బానిసై.. చివరికి ఒక చిన్న కారణంగా భార్య మీద తనకు ప్రేమెంతుందో తెలియజేసే... సీన్స్ సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయి.
మరి ఇలా రెండు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన శివ నిర్వాణతో సినిమా చేసేందుకు ఇప్పుడు కుర్ర హీరోలు పోటీపడుతున్నారట. ఎలాగూ శివ నిర్వాణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చెయ్యలేదు. అందుకే శివ ఇప్పుడు ఏ హీరోతో తన నెక్స్ట్ సినిమా చేస్తాడా అనే ఉత్సుకతతో ప్రేక్షకులే కాదు.... ఇండస్ట్రీ జనాలు కూడా ఉన్నారు. మరి రెండు హిట్స్ కొట్టిన శివ నిర్వాణ తన హ్యాట్రిక్ హిట్ ని ఏ హీరోతో కొడతాడో అనేది కాస్త వేచి చూడాల్సి ఉంది.