హలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శిని ఆ సినిమా ఆమెకి యావరేజ్ మాత్రమే ఇచ్చింది. హలో సినిమా యావరేజ్ కన్నా.. ప్లాప్ అనే చెప్పాలి. ఆ సినిమాలో అఖిల్ కి జోడిగా డీసెంట్ క్యారెక్టర్ చేసిన కళ్యాణి.. తనకి టాలీవుడ్ లో బ్రేకొస్తుంది అని ఆశపడింది. మరి మొదటి విఘ్నాన్ని దాటలేకపోయిన కళ్యాణి ప్రియయదర్శిని తన ద్వితీయ విఘ్నాన్ని ఎలా దాటుతుందో. అసలే ప్లాప్ హీరో పక్కన నటించింది. ఆరు సినిమాల ప్లాప్ లో ఉన్న సాయి ధరమ్ సరసన చిత్రలహరి సినిమాలో కళ్యాణి వన్ ఆఫ్ ద హీరోయిన్.
చిత్రలహరిలో మరో హీరోయిన్ నివేత పేతురేజ్ కూడా నటించింది. అయితే సాయి ధరమ్ పక్కన కళ్యాణి ప్రియదర్శిని మళ్ళీ డీసెంట్ క్యారెక్టర్ లోనే నటిస్తుంది. అయితే చిత్రలహరి మీద బయట మంచి అంచనాలే ఉన్నాయి. కామెడీ ఎంటెర్టైనెర్ గా ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల మలిచినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి తన రెండో చిత్రం చిత్రలహరి సినిమా తో హిట్ కొట్టి.... యంగ్ హీరోల సరసన అవకాశాలు పట్టాలనే ప్లాన్ లో కళ్యాణి ఉంది. మరి కళ్యాణి కోరికను ఈ ప్లాప్ హీరో ఎంతవరకు తీరుస్తాడో.. చూద్దాం. ఇప్పటివరకు అయితే చిత్రలహరి మీద పాజిటివ్ టాకే ఉంది. సెన్సార్ పాజిటివ్ గా ఉండడం, టీం కూడా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది. చూద్దాం ఈ తమిళ కుట్టి రెండో సినిమా ఫలితం ఎలా వుండబోతుందో అనేది.