Advertisementt

సాయిధరమ్‌ లక్కుకు ఇంకొన్ని గంటలే!

Fri 12th Apr 2019 01:15 PM
sai dharam tej,chitralahari movie,hopes,release  సాయిధరమ్‌ లక్కుకు ఇంకొన్ని గంటలే!
Sai Dharam Tej hopes on Chitralahari సాయిధరమ్‌ లక్కుకు ఇంకొన్ని గంటలే!
Advertisement
Ads by CJ

డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరి సినిమా చేసాడు. మరి ఈ సినిమా హిట్ సాయి ధరమ్ కి అత్యంత అవసరం. మొదట్లో మెగా హీరోగా యావరేజ్ హిట్స్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ మూడేళ్ళలో ఆరు ప్లాపులను మూటగట్టుకున్నాడు. ఆరు ప్లాపులంటే అతని నెక్స్ట్ సినెమాల మార్కెట్ ఎలా ఉంటుంది.. పూర్తిగా పడిపోతుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ మెగా హీరోకి గుడ్డిలో మెల్లలా చిత్రలహరి సినిమా మీద మంచి హోప్స్ కనబడుతున్నాయి. 

చిత్రలహరి సాంగ్స్ కి దేవిశ్రీ కాస్త ఇంట్రెస్టింగ్ ట్యూన్స్ ఇచ్చాడు. ఇక చిత్రలహరి ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేసింది. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఉన్న ప్లాప్స్ పరిస్థితిని చిత్రలహరి సినిమాలో చూపెట్టారు. ఎప్పుడూ సక్సెస్ కోసం తపించే వ్యక్తిగా సాయి ధరమ్ క్యారెక్టర్ చిత్రలహరి సినిమాలో ఉంది. సక్సెస్ దరిచేరక నిత్యం నిరాశతో బ్రతికే యువకుడిగా.. ఎలా తన జీవితం బాగుపడుతుందా అని ఎదురు చూసే పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తాడట. మరి ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న సాయి ధరమ్ కి సినిమా క్లైమాక్స్ లో సక్సెస్ వచ్చినట్టుగా ఆరు ప్లాప్స్ తర్వాత హిట్ కొడతాడో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. అయితే ఈ సినిమా విజయంపై సాయి ధరమ్ చిత్రలహరి ప్రమోషన్స్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నాడు.

Sai Dharam Tej hopes on Chitralahari:

Chitralahari Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ