Advertisementt

‘జెర్సీ’ ట్రైలర్: అడుగడుగునా అవమానాలే!

Sat 13th Apr 2019 11:50 AM
hero nani,jersey movie,trailer,report  ‘జెర్సీ’ ట్రైలర్: అడుగడుగునా అవమానాలే!
Jersey Trailer talk ‘జెర్సీ’ ట్రైలర్: అడుగడుగునా అవమానాలే!
Advertisement
Ads by CJ

‘కృష్ణార్జున యుద్ధం’ ప్లాప్ తర్వాత నాని ‘మళ్లిరావా’ ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో  ‘జెర్సీ’ అనే క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా చేసాడు. ‘జెర్సీ’ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అనిరుద్ సంగీతం అందించిన ‘జెర్సీ’ ప్రోమోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ‘జెర్సీ’ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సినిమాలో నానికి జోడిగా శ్రద్ధ శ్రీనాధ్ నటిస్తుంది. ఇక ‘జెర్సీ’ ట్రైలర్ తో సినిమా మీద ఉన్న అనుమానాలను అన్నిటిని దూరం చేసింది ‘జెర్సీ’ టీం. ఏదేదో.. ఒక క్రికెటర్ బయోపిక్ అంటూ జరుగుతున్న ప్రచారానికి ‘జెర్సీ’ ట్రైలర్ ఫుల్ స్టాప్ పెట్టేయ్యడమే కాదు.. ‘జెర్సీ’ సినిమా స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేసేసారు.

క్రికెటర్ గా ఫామ్ లో ఉన్న అర్జున్ (నాని) ని హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ ప్రేమించడం.. ప్రతి క్షణం అర్జున్ తోనే తిరుగుతూ.. డీప్ రొమాన్స్ చెయ్యడం.. ఇక వయసులో ఉన్న కుర్రాళ్ళలాగే అర్జున్ కూడా కొట్లాటలు గొడవలతో.. క్రికెట్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడడం... శ్రద్ద శ్రీనాధ్ ని ప్రేమించి పెళ్లాడడం... పెళ్ళాం సంపాదనతోనే పదేళ్లు గడిపేసిన అర్జున్ కి ప్రతి క్షణం భార్య నుండి ఛీత్కారాలు ఎదురవడంతో... ఒకరోజు తన కొడుకు పుట్టినరోజు చెయ్యడానికి బయటివారిని అప్పు అడిగితే ఇవ్వలేదని....భార్య పర్స్ లోని డబ్బు తీస్తూ భార్యకి దొరికిన క్షణం అర్జున్ పడిన మానసిక ఘర్షణతో.... మళ్ళీ కోచ్ సత్యరాజ్ ప్రోద్బలంతో 35 ఏళ్ళకి క్రికెట్ లోకి అడుగుపెట్టి.... అక్కడ కూడా ఛీత్కారాలు ఎదుర్కుంటూ.... కొడుకు కోసం కెరీర్ లో సక్సెస్ అయ్యే అర్జున్ జర్నీనే ఈ ‘జెర్సీ’. 

మరి అర్జున్ పాత్రలో నాని ఎప్పటిలాగే జీవించాడు. ఇక మొదటిసారి తెలుగు తెరకు పరిచయమవుతున్న హీరోయిన్ శ్రద్ద కూడా ప్రియురాలిగా, భార్యగా తన పాత్రను పర్ఫెక్ట్ గా నడిపించింది. అనిరుద్ మ్యూజిక్ ఓకే కానీ... నేపధ్య సంగీతం మాత్రం బావుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా జెర్సీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు.

Click Here for Trailer

Jersey Trailer talk:

Nani Jersey Movie Trailer report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ