Advertisementt

దూసుకుపోతున్న ‘మహర్షి’ సెకండ్ సింగిల్

Sun 14th Apr 2019 01:04 PM
maharshi,second single,mahesh babu,maharshi movie,srimani,dsp  దూసుకుపోతున్న ‘మహర్షి’ సెకండ్ సింగిల్
Maharshi Second Single Released దూసుకుపోతున్న ‘మహర్షి’ సెకండ్ సింగిల్
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకుముందే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న ‘మహర్షి’ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. 

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేసేయ్ మిసైలులా...’ అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. దూసుకుపోతోంది. 

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Click Here for Song

Maharshi Second Single Released:

Tremoundes Response to Maharshi second Sigle

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ