రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ RRR మూవీ పై భారీ అంచనాలున్నాయి. విడుదలయ్యేది వచ్చే ఏడాది అయినా... సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే నిర్మాత డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే.. ఫ్రీ గా 100 కోట్లు ఇస్తానంటూ ఎవరో ఒక బడా ప్రొడ్యూసర్ ఆఫర్ కూడా ఇచ్చాడనే టాక్ నడిచింది. మరి భారీగా పెట్టుబడి పెడుతున్న ఈ సినిమాని రాజమౌళి బాహుబలిని మించిన రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. అందుకే నిర్మాత కూడా అడిగింది కాదనకుండా పెట్టుబడి పెడుతున్నాడు.
తాజాగా RRR పై ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలోనూ, ఫిలింసర్కిల్స్ లోను హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ రెస్ట్ లో ఉంటే.. ఎన్టీఆర్ పై రాజమౌళి RRR లోని కీలకసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం పాత్ర పై తెరకెక్కిస్తున్న కీలకసన్నివేశాల కోసమే రాజమౌళి ఏకంగా 22 కోట్లు ఖర్చు పెడుతున్నాడని న్యూస్ ఫిలింసర్కిల్స్ ని షేక్ చేస్తుంది. RRR లోని నాలుగైదు నిమిషాల్లో కొమరం భీం తన విశ్వరూపాన్ని చూపిస్తాడని అంటున్నారు. అందుకోసం హైటెక్నాలజీ కెమెరాలను వినియోగిస్తున్నారట.
అయితే కేవలం ఎన్టీఆర్ కోసమే అలా భారీగా ఖర్చు చెయ్యడం లేదట. రామ్ చరణ్ అండ్ అజయ్ దేవగన్ చేసే ఎపిసోడ్ కోసం కూడా రాజమౌళి భారీగా ఖర్చు పెడుతున్నాడట. ఇక చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ కోసం 50 నుంచి 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. మరి ఈ రేంజ్ ఖర్చు సినిమాలో ఉండబట్టే.. RRR కి ఏకంగా 300 కోట్లపైనే బడ్జెట్ పెడుతున్నాడు నిర్మాత. ఇక చరణ్ హీరోయిన్ అలియా కి కూడా భారీ పారితోషకమే ఇస్తున్న RRR నిర్మాత.. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని అంటున్నారు.