బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అంటే.. బడా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన క్యూట్ గర్ల్, హాట్ హీరోయిన్, చిన్నవయసులోనే టాప్ స్టేజ్ కి వెళ్లిన హీరోయిన్ అనే చాలామందికి తెలుసు. కానీ సౌత్ ప్రేక్షకులకు అలియా భాట్ అంటే అందాల రాణి. కానీ తాజాగా రామ్ చరణ్ సరసన అలియా భట్ RRR లో నటిస్తుంది అనగానే... అందరి కళ్లు ఈ చిన్నదాని మీదే ఉన్నాయి. రణబీర్ కపూర్ తో ప్రేమాయణం విషయంలో ఎంతగా పాపులర్ అయ్యిందో.. RRR సినిమాలో అలియా భట్ హీరోయిన్ అనగానే గూగుల్ సెర్చింగ్ లో అంతే పాపులర్ అయ్యింది.
మరి RRR లో నటిస్తున్న అలియా భట్.. సైన్ చేసిన చిత్రాలపై బాలీవుడ్ ప్రేక్షకులే కాదు సౌత్ ప్రేక్షకులు స్పెషల్ ఫోకస్ పెట్టేసారు. అమ్మడు నటించిన కళంక్ చిత్రం ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కిన కళంక్ సినిమా కి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన దక్కలేదు. క్రిటిక్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా కళంక్ సినిమాకి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో.. ఓవరాల్ గా కళంక్ ప్లాప్ నే మూటగట్టుకుంది. కానీ ఈ బడా మల్టీస్టార్ కి భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. ఈ సినిమాలో అలియా భట్ నటనకు, మాధురి దీక్షిత్ నటనకు, వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే పడినా.. అభిషేక్ వర్మన్ దర్శకత్వం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు సినిమాలో కంటెంట్ లేకపోవడంతో.. అలాగే నిడివి ఎక్కువ కారణంగా సినిమాకి ప్లాప్ టాక్ పడింది.
సంజయ్ దత్, మాధురి దీక్షిత్, అలియా భట్, వరుణ్ ధావన్ అంతా కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నప్పటికీ... ఆ అంచనాలు అందుకోవడంలో కళంక్ విఫలమైంది. మరి గత ఏడాది సూపర్ హిట్స్ తో అందరి చూపు తన మీదకి తిప్పుకున్న అలియా భట్ ఈ ఏడాది ఈ భారీ బడ్జెట్ మూవీ తో ప్లాప్ అందుకుంది.