ఈ ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తో సాదా సీదాగా థియేటర్స్ లోకి దిగిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 సినిమా థియేటర్స్ దుమ్ము దులిపి ఈ ఏడాది మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద పెద్ద సినిమాలనే తొక్కేసి.. 60 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టే హిట్ అందించింది నిర్మాత దిల్ రాజుకి. ఎఫ్ 2 విడుదలైన రెండు నెలల పాటు సరైన సినిమా లేకపోవడంతో.. ఎఫ్ 2 కి తిరుగులేకుండా పోవడం.. కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ అవడం జరిగింది. ఇక సినిమా విడుదలైన నెలన్నరకే ఈ ఎఫ్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసింది. అయితే థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్, అమెజాన్ ప్రైమ్ లో రాలేదని... ఎఫ్ 2 థియేటర్స్ లో హిట్.. అమెజాన్ లో ప్లాప్ అనే న్యూస్ నడిచింది.
తాజాగా వెండితెర మీద బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2 బుల్లితెర మీద మాత్రం ఆ సత్తా చాటలేకపోయింది. బాహుబలి తర్వాత, గీత గోవిందం టాప్ లో నిలిస్తే.. ఆ తర్వాత గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం బుల్లితెర మీద టీఆర్పీ రేటింగ్స్ లో ది బెస్ట్ గా నిలిచింది. మరి ఎఫ్ 2 ఆ సినిమాల సరసన నిలుస్తుందని ఆశపడిన ఛానల్ కి ఎఫ్ 2 నిరాశనే మిగిల్చింది. ఎఫ్ 2 విడుదలైన మూడు నెలలకు మా టీవీ లో ప్రసారం అయిన ఈ మూవీ 17.2 రేటింగ్ తెచ్చుకుంది. మరి వెండితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయింది. కారణం ఎఫ్ 2 సెకండ్ హాఫ్ ని ఫామిలీస్ అంతగా ఆదరించలేకపోవడమే కారణమంటున్నారు.