Advertisementt

‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’ రెడీ అవుతున్నారు

Sat 20th Apr 2019 10:17 PM
romantic criminals,final stage,p suneel kumar reddy,bapiraju,romantic criminals movie  ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’ రెడీ అవుతున్నారు
Romantic Criminals in Final Stage ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’ రెడీ అవుతున్నారు
Advertisement
Ads by CJ

తుది మెరుగుల్లో సునిల్ కుమార్ రెడ్డి ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’

‘ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ‌’ వంటి సందేశాత్మ‌క క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించడమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు బ‌డ్జెట్ లు అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్‌లో ట్రెండ్‌ని క్రియేట్ చేసిన పి. సునిల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటుంది.  ‘ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ‌’ చిత్రాల‌కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆంధ్రప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నంలో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టూడియో రిసాలి స్టూడియోలో శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన బి.బాపిరాజు మాట్లాడుతూ.. ‘‘శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్‌, శ్రావ్యాఫిలింస్ బ్యాన‌ర్‌లో పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో విడుద‌లైన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ‌’ త‌ర‌హాలో సీక్వెల్‌గా ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’ తెర‌కెక్కించాము. ఈ సినిమా పూర్తిగా న‌వ్యాంధ్రలో స్మార్ట్‌సిటీగా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటి విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ జ‌రుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల ర‌హ‌స్యాన్ని ఆద్యంతం ఆసక్తిక‌రంగా తీర్చిదిద్దాము. ఈ చిత్రం గ‌త రెండు చిత్రాల‌కంటే ఎక్కువగా ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంది. యువ‌తని ప‌ట్టిపీడించే వ్య‌స‌నాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజి స్టూడెంట్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థలో  హీరోగా మ‌నోజ్ నంద‌న్‌, విల‌న్‌గా వినోద్, హీరోయిన్స్ అవంతిక‌, దివ్య‌, మౌనికలు చాలా చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌ర్చారు. ఏజేన్సీ ఏరియాలో గంజాయ్ తోట‌లో పోలీసుల భ‌ద్ర‌త మ‌ధ్య ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. వ్య‌స‌నాలు ఏమైనా వాటి ప‌ర్య‌వ‌ససానాలు వినాశ‌కార‌కంగా ఉంటాయ‌నే పాయింట్ ని వినోదం పాళ్ళు త‌గ్గించ‌కుండా మా ద‌ర్శ‌కుడు పి. సునిల్ కుమార్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌ుకుంటుంది’’ అని అన్నారు

ద‌ర్శ‌కుడు పి.సునిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ‘రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌’ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. న‌టీన‌టులు కూడా చాలా చ‌క్క‌గా పాత్ర‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసి మ‌రీ న‌టించారు. ముందు రెండు చిత్రాలను మించి వినోదంతో పాటు చ‌క్క‌టి మెసెజ్ వుంటుంది. ఈ చిత్రానికి ఎస్‌.వి. శివ‌రామ్ సినిమాటోగ్ర‌ఫి చిత్రానికి హైలెట్ అవుతుంది. విశాఖ, అర‌కు లోని అందాలే కాకుండా గంజాయ్ తోట‌ల్లో పోలీసుల దాడి చేసే స‌న్నివేశాలు చాలా చ‌క్క‌గా చిత్రీక‌రించాము. శామ్యూల్ క‌ళ్యాణ్ ఎడిటింగ్ సినిమా ఫేస్‌ని పెంచేలా వుంది. సుధాక‌ర్ మారియో సంగీతం సార‌థ్యంలో నాలుగు పాట‌లు చాలా చక్క‌గా కుదిరాయి. త్వ‌ర‌లో ప్ర‌ముఖ ఆడియో సంస్థ ద్వారా ఆడియోని విడుద‌ల చేస్తాము. మే నేల‌లో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్‌ చేస్తున్నారు..’’ అని అన్నారు.

Romantic Criminals in Final Stage:

Romantic Criminals Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ