‘బ్రోచేవారెవరురా’ టీజర్ చాలా హంటింగ్‌గా.. ఫన్నీగా ఉంది: హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి
‘మెంటల్ మదిలో’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నివేత థామస్ హీరోయిన్‌గా సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రదారులుగా మన్యం ప్రొడక్షన్ పతాకంపై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఏప్రిల్ 20న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై బ్రోచేవారెవరురా టీజర్‌ని రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నివేత థామస్, దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటులు సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, ఎడిటర్ రవితేజ, నిర్మాత విజయకుమార్ మన్యం తదితరులు పాల్గొన్నారు.
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘శ్రీ విష్ణు అప్పట్లో ఒకడుండేవాడు మూవీకి క్లాప్ కొట్టాను.. ఆ సినిమా స్లోగా పికప్ అయి బాగా ఆడింది. ఈ సినిమా టీజర్ ఫన్నీగా హాంటింగ్‌గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వివేక్ ఆత్రేయ మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు, కెరియర్ ఉండాలని.. నివేత పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత విజయ్ మరిన్నీ మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘వివేక్ ఫస్ట్ కథ చెప్పగానే బాగా నచ్చింది. టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం కాపాడేవాడు అని చెప్పగానే ఓకే చెప్పాను. నేను, ప్రియదర్శి, రామకృష్ణ అందరం చాలా నేచురల్‌గా నటించాం. అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత విజయ్ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటితో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మన్యంపులిలా విజృంభిస్తూ మరిన్ని చిత్రాలు నిర్మించాలి..’’ అన్నారు.
హీరోయిన్ నివేత థామస్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో బెస్ట్ టీముతో వర్క్ చేసాను. ఇందులో మంత్ర క్యారెక్టర్లో నటించాను. ఈ సినిమా ఈజీగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. అన్నారు.
నిర్మాత విజయ్ కుమార్ మన్యం మాట్లాడుతూ.. మెంటల్ మదిలో చిత్రం చూశాక దర్శకుడు వివేక్‌కి ఫ్యాన్ అయ్యాను. అప్పుడే వివేక్‌తో సినిమా తియ్యాలి అనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్టు సెట్ అయ్యింది. శ్రీవిష్ణు దగ్గరుండి సొంత సినిమాలా ఫీలయి చూసుకున్నారు. ఆర్టిస్టులు, టెక్క్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. నివేత మా చిత్రానికి పెద్ద ఎస్సెట్ అయింది. షూటింగ్ అంతా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.