Advertisementt

‘దిక్సూచి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Mon 22nd Apr 2019 07:19 PM
diksoochi,diksoochi release date,diksoochi movie,diksoochi telugu movie,dileep kumar  ‘దిక్సూచి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Diksoochi Release Date Fixed ‘దిక్సూచి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

ఈ నెల 26న దిలీప్‌కుమార్ స‌ల్వాది ‘దిక్సూచి’ విడుదల 

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న  విడుదల చేయబోతున్నారు.  

ఈ సంద‌ర్భంగా హీరో, దర్శకుడు దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ.. ‘‘నిర్మాత నరసింహరాజుగారు న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఓ కొత్త జోనర్‌లో సినిమాను చేశాము. ఫ్యామిలీ అంతా హాయిగా చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ. సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో తీసిన ఈ చిత్రం 2019లో ది బెస్ట్ మూవీ‌గా ఉంటుందని మా టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఏప్రిల్ 26న గ్రాండ్‌గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. అందరూ చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము..’’ అన్నారు.

దిలీప్‌కుమార్ స‌ల్వాది, ఛత్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి 

పి.ఆర్.ఓ: సాయి సతీష్,

ప్రొడ్యూస‌ర్స్: న‌రసింహరాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, 

కెమెరా: జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, 

మ్యూజిక్ డైరెక్టర్: ప‌ద్మనాభ్  భ‌ర‌ద్వాజ్‌, 

లిరిక్స్: శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, 

స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, ఎడిటింగ్, డైరెక్ష‌న్: దిలీప్‌కుమార్ స‌ల్వాది.

Diksoochi Release Date Fixed:

Diksoochi Release on April 26th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ