Advertisementt

మిడిల్ క్లాస్ భార్యలుగా ఇరగదీశారు

Tue 23rd Apr 2019 02:20 PM
samantha,shraddha srinath,middle class wife, majili,jersey  మిడిల్ క్లాస్ భార్యలుగా ఇరగదీశారు
Samantha and Shraddha Srinath Roles Highlights in Majili and Jersey మిడిల్ క్లాస్ భార్యలుగా ఇరగదీశారు
Advertisement
Ads by CJ

ఈమధ్యన అంటే ఈ నెలలో విడుదలైన రెండు సినిమాల్లో క్రికెట్ మాత్రమే పోలిక కాదు. మజిలీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అలాగే నాని జెర్సీ కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన సమంత, శ్రద్ద శ్రీనాధ్ పాత్రలకు చాలా దగ్గరపోలికలే ఉన్నాయి. మజిలీ సినిమాలో జాబ్ లేని చైతుకి వైఫ్ గా సమంత శ్రావణి అనే మిడిల్ క్లాస్ భార్య పాత్రలో అదరగొట్టే పెరఫార్మెన్సుతో ఇరగదీసింది. ఇక జెర్సీ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్ కూడా నానికి లవర్ గా కాస్త పార్ష్ గా కనిపించినప్పటికీ.. నానితో పెళ్లి తర్వాత సారా అనే క్రిస్టియన్ పాత్రలో మిడిల్ క్లాస్ భార్యగా అదరగొట్టే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

అయితే మజిలీ సినిమాలో భర్త పూర్ణ (చైతు) ఉద్యోగం చెయ్యకపోయినా.. తన తండ్రి(పోసాని) మామ (రావు రమేష్) ల దగ్గర వెనకేసుకొస్తూ భర్త అవసరాలను తీరుస్తూ.. భర్తతో ఏ సుఖం సంతోషం లేకుండా బాధపడే ఎమోషనల్ క్యారెక్టర్ లో సమంత నటనకు థియేటర్స్ లోనే కాదు.. ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి క్లాప్స్ పడ్డాయి. ఇక జెర్సీ సినిమాలో ఉద్యోగం పోగొట్టుకున్న భర్త ఉద్యోగాన్ని తిరిగి తెచ్చేందుకు కాస్త కఠినంగా డబ్బు దాస్తూ.. భర్త దుబారా ఖర్చులకు డబ్బు అందకుండా.... తనలో తానే మానసిక సంఘర్షణకు లోనవుతూ.. ఏం మాట్లాడినా.. ఎలాంటి సమాధానం ఇవ్వని భర్తతో అడ్జెస్ట్ అయ్యే పాత్రలో శ్రద్ద శ్రీనాధ్ నటనకు ప్రేక్షకులు కూడా విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. మరి శ్రావణి, సారా పాత్రలలో మధ్యతరగతి భార్యలు తమని తాము ఊహించుకుంటున్నారు అంటే... ఆ పాత్రల తాలూకు ఎమోషన్ ఏ రేంజ్ లో పండిందో అర్ధమవుతుంది. 

Samantha and Shraddha Srinath Roles Highlights in Majili and Jersey:

Heroines Impresed with Their Middle Class Wife Roles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ