ఈనెలలో మజిలీ సూపర్ హిట్ తర్వాత.. చిత్రలహరి హిట్ అయ్యింది. ఇక ఆ రెండు సినిమాలు తర్వాత నాని జెర్సీ సినిమాని ఏప్రిల్ మూడో వారంలో వదిలాడు. నాని అనుకున్న దానికన్నా జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే నాని గనక జెర్సీ సినిమాని సోలోగా దించినట్టు అయితే గనక జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ మాత్రమే కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా వచ్చేవి. కానీ జెర్సీ సినిమాకి ముందు నుండి చెబుతున్నట్టుగానే లారెన్స్ కాంచన 3 గండం పొంచి ఉందని.... నిజంగా చెప్పినట్టుగానే.. కాంచన 3 నెగెటివ్ టాక్ తోనే రాఘవ క్రేజ్ తో జెర్సీ సినిమాకి పోటీ ఇచ్చి సూపర్ గా కలెక్షన్స్ కొల్లగొడుతుంది.
మరి జెర్సీ కొచ్చిన టాక్ కి జెర్సీ కి పోటీ గనక లేకపోతె... ఆసినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చేవి. ఇక రెండో వారంలో కూడా జర్సీ భారీ గా కొల్లగొడుతుందనే అనుకున్నారు. ఎందుకంటే బెల్లకొండ శ్రీనివాస్ సీత సినిమా థియేటర్స్ దొరక్క మే చివరి వారానికి వాయిదా పడింది. దానితో జెర్సీకి రెండో వారంలో తెలుగు, తమిళం నుండి పోటీ లేకుండా పోయింది.
నాని - గౌతమ్ లు హమ్మయ్య అనుకునేలోపు హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ద ఎండ్ గేమ్ గండం జెర్సీకి తగులుకుంది. ద ఎండ్ గేమ్ మీద అదేం క్రేజో గాని.. టికెట్స్ ఇలా ఓపెన్ అవుతున్నాయో లేదో.. అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరి జెర్సీ సినిమాని మొదటివారం కాంచన 3, రెండో వారం ద ఎండ్ గేమ్ లు బాగా ఇరికించాయనే చెప్పాలి. లేదంటే రెండు వారాలేమిటి.. మహర్షి వచ్చే వరకు జెర్సీ సినిమాదే హావా అయ్యేది. కానీ కాంచన 3తో మొదటివారం నష్టపోయిన జెర్సీ.. రెండో వారం ద ఎండ్ గేమ్ వలన నష్టపోవాల్సిన పరిస్థితి.