Advertisementt

తెనాలి రామ‌కృష్ణ ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్!

Sat 27th Apr 2019 12:07 PM
sundeep kishan,tenali ramakrishna babl,first look,release,may 7  తెనాలి రామ‌కృష్ణ ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్!
Date Fixed for Tenali Ramakrishna BABL 1st Look తెనాలి రామ‌కృష్ణ ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

తెలుగు, త‌మిళంలో సందీప్ కిష‌న్  ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్...’ మే 7న ఫ‌స్ట్ లుక్‌

సందీప్ కిష‌న్ న‌టిస్తున్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌’. తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మే 7న విడుద‌ల కానుంది. తెలుగు, త‌మిళంలో ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. హ‌న్సిక నాయిక‌గా న‌టిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మ‌క చిత్రంగా రూపొందుతోంది.

60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాతో తెలుగులోకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్ త‌దితరులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’కు సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక స‌మ‌యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

సందీప్ కిష‌న్‌, హ‌న్సిక‌, ముర‌ళీ శ‌ర్మ‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్‌, ప్ర‌భాస్ శ్రీను, పృథ్వి, ర‌ఘు బాబు, స‌ప్త‌గిరి, ర‌జిత‌, కిన్నెర, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య‌, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

ద‌ర్శ‌క‌త్వం:  జి. నాగేశ్వ‌ర రెడ్డి

నిర్మాత‌లు:  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీశ్‌

సంస్థ‌:  శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్

స‌మ‌ర్ప‌ణ‌:  ఇందుమ‌తి శ్రీనివాసులు

క‌థ‌:  టి. రాజ‌సింహ‌

సంగీతం:  సాయికార్తీక్‌

కెమెరా:  సాయి శ్రీరామ్‌

ఎడిట‌ర్:  చోటా కె ప్ర‌సాద్‌

మాట‌లు:  నివాస్‌,  భ‌వానీ ప్ర‌సాద్‌

స్క్రీన్‌ప్లే:  రాజు, గోపాల కృష్ణ‌

ఆర్ట్:  కిర‌ణ్‌

యాక్ష‌న్‌:  వెంక‌ట్‌

పీఆర్వో:  వంశీ శేఖ‌ర్

Date Fixed for Tenali Ramakrishna BABL 1st Look:

Tenali Ramakrishna BABL 1st Look on May 7th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ