కొందరుహీరోల చిత్రాలు విడుదలవుతున్న సమయంలో వారి వ్యక్తిగత ప్రవర్తనను చూసి మరీ కొందరు వారి చిత్రాలు బాగా ఆడాలని కోరుకుంటారు. ఉదాహరణకు పవన్‌కళ్యాణ్‌ని సినిమా స్టార్‌గా, రాజకీయ నాయకుని కంటే ఆయన భావాలు, సింప్లిసిటీకి ముగ్దులై ఆయనకు ఫ్యాన్స్ అయిన వారు ఎక్కువ. ఇక తాజాగా రెండు చిత్రాలు విడుదలయ్యాయి. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ ఒకటి కాగా, రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ ఒకటి. ఈ ఇద్దరు వివాదరహితులు, ఎంతో మంచి మనసున్నవారు. దాంతో ప్రేక్షకులు కూడా ఈ రెండు చిత్రాలు హిట్ కావాలని భావించారు. వారి ఆశీర్వాద బలమో ఏమోగానీ నాని ‘జెర్సీ’కి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చి, బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ప్రశంసలు వచ్చినా ఈ చిత్రం మల్టీప్లెక్స్, ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్‌ని సాధిస్తూ వస్తోంది.
కానీ నిజానికి ఈ చిత్రానికి వచ్చిన టాక్‌తో పోల్చిచూస్తే కలెక్షన్లు ఆ రేంజ్‌లో లేవు. బి,సి సెంటర్, మాస్ ఆడియన్స్ మాత్రం పలు విమర్శలు, బ్యాడ్‌మౌత్‌టాక్, రివ్యూలు తెచ్చుకున్న ‘కాంచన 3’ వైపే చూస్తున్నారు. ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘కాంచన 3’ టాక్‌తో సంబంధం లేకండా సాధిస్తున్న కలెక్షన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక తాను కేవలం మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకునే ‘కాంచన 3’ తీశానని, అది వారికి చేరువైందని లారెన్స్ ఆనందంలో ఉన్నాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో కలిపి 100కోట్ల దిశగా పయనం సాగిస్తోంది. అయినా ఇంతకు ముందు ముని, కాంచన, గంగలతో పోలిస్తే ‘కాంచన 3’లో లోపాలు చాలా ఉన్నాయని, రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తున్నాయని కొందరు చెప్పారని, ‘కాంచన 4’లో ఆ లోటును భర్తీ చేస్తానని లారెన్స్ చెప్పుకొచ్చాడు. అన్నింటి కంటే ముఖ్య విషయం ఏమిటంటే... ఒక హీరో మరో హీరో సినిమాని ప్రశంసించేందుకు కాస్త ఇబ్బంది పడతారు.
అలాంటిది తన సినిమాకి పోటీగా వచ్చిన చిత్రం గురించి పాజిటివ్‌గా మాట్లాడటంతో పాటు ఆ చిత్రాన్ని తప్పకుండా చూడమని కోరడం గొప్ప విషయం. లారెన్స్ తాజాగా అదే చేశాడు. లారెన్స్ మాట్లాడుతూ, ‘రాత్రే ‘జెర్సీ’ చిత్రం చూశాను. చాలా బాగుంది. అద్బుతమైన సినిమా అంటూ ప్రశంసలు కురిపించాడు. తప్పకుండా ‘జెర్సీ’ని చూడమని ఆయన ప్రేక్షకులను కోరాడు. టారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తన చిత్రమే ఆడాలి... పక్కనోడి చిత్రాన్ని పైరసీ ద్వారా అయినా దెబ్బ కొట్టాలి అని కుట్రలు, కుతంత్రాలు చేసే వారున్న నేటిరోజుల్లో లారెన్స్ వంటి వారు అరుదు. అందుకే కోలీవుడ్‌లో ఆయన్ను రజనీకాంత్, అజిత్‌ల తర్వాత అంత మానవత్వం ఉన్న వాడిగా భావిస్తారు.