Advertisementt

శ్రద్ధాశ్రీనాధ్ గట్స్‌కొచ్చిన హిట్ ఇది!

Mon 29th Apr 2019 07:07 PM
shraddha srinath,daring,decision,jersey movie  శ్రద్ధాశ్రీనాధ్ గట్స్‌కొచ్చిన హిట్ ఇది!
Shraddha Srinath Daring Decision For Jersey Movie శ్రద్ధాశ్రీనాధ్ గట్స్‌కొచ్చిన హిట్ ఇది!
Advertisement
Ads by CJ

మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్యన విడుదలైన గౌత తిన్ననూరి - నానిల జెర్సీ సినిమా అనుకోని బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ ని నాని అండ్ దర్శకుడు తిన్ననూరి కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండరు. మొదటి షోకే జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నానికి ఎంతగా పేరొచ్చిందో... డైరెక్టర్ గౌతమ్ కి అంతే పేరొచ్చింది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాధ్ పేరు కూడా నిన్నమొన్నటి వరకు మీడియాలో మార్మోగడమే కాదు.. అనేకమంది హీరోల కొత్త ప్రాజెక్టులలో శ్రద్ధాని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే జెర్సీ సినిమాతో శ్రద్ధా శ్రీనాధ్ సుడి అలా తిరగడానికి కారణం.. ముందుగా ఈ సినిమాలో శ్రద్దా పేరుని దర్శకుడు, హీరో నాని పరిశీలించలేదట.

జెర్సీ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి మరో హీరోయిన్ ని అనుకున్నాడట. అంతేకాకుండా కాస్త పేరున్న హీరోయిన్స్ అయితే సినిమాకి క్రేజొస్తుందని.. అందుకే ఆ టాప్ హీరోయిన్ ని జెర్సీ కోసం సంప్రదించగా.. వారు జెర్సీలో సారా పాత్ర చెయ్యడానికి భయపడ్డారట. మరి ఒకే ఎమోషన్ అండ్ ఎక్సప్రెషన్ ని మెయింటింగ్ చేస్తుండాలి, అలాగే కాస్త ట్రెడిషనల్ గా నటించాలి, మరా సినిమా మీద నమ్మకం లేకనో... ఆ హీరోయిన్స్ నో చెప్పారట.

అయితే ఆ హీరోయిన్స్ కాదని చెప్పాకే.. దర్శకుడు గౌతమ్, శ్రద్ధా శ్రీనాధ్ ని సంప్రదించాడట. మరి సారా పాత్ర చెయ్యడానికి శ్రద్ధా శ్రీనాధ్ ధైర్యంగా ఒప్పుకుని నటించింది. మరా ధైర్యానికి తగిన ఫలితం దక్కింది. జెర్సీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నానితో పాటుగా సారా పాత్ర చేసిన శ్రద్ధాకి అంతే పేరొచ్చింది. తాజాగా శ్రద్ధాశ్రీనాధ్ మరో తెలుగు మూవీని ఓకే చేసిందనే టాక్ ఉంది.

Shraddha Srinath Daring Decision For Jersey Movie:

Shraddha Srinath Gets Hit With Jersey

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ