Advertisementt

సూపర్ స్టార్ తరువాత మెగా పవర్ స్టారే!

Tue 30th Apr 2019 12:10 AM
ram charan,birthday,japan,fans,gifts,surprise  సూపర్ స్టార్ తరువాత మెగా పవర్ స్టారే!
japan fans celebrates ram charan birthday సూపర్ స్టార్ తరువాత మెగా పవర్ స్టారే!
Advertisement
Ads by CJ

రజనీకాంత్ క్రేజ్ గురించి వేరే చెప్పేది ఏముంటది చెప్పండి. ఆయనకు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లాంటి దేశంలో కూడా రజినీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఇండియన్ హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉంటారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తరువాత స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణే అంటా.

అందుకు నిదర్శనం ఇటీవలే జపాన్ అభిమానుల నుండి రామ్ చరణ్ కి అందిన పుట్టిన రోజు కానుకలే. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జపాన్ నుండి ఆయనకు చాలా కానుకలు వచ్చాయి.  చరణ్ కు ‘రంగస్థలం’ తరువాత విదేశాల్లోనూ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ జపాన్ లో మరీనూ. చరణ్ బర్త్ డే వేడుకలు తన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా రజిని ఫ్యాన్స్ కూడా జరుపుతారు. మిగిలిన హీరోస్ ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు గాని.. మెగా పవర్ స్టార్ కోసం మెగా ఫ్యాన్స్ అంతకన్నా భారీగా నిర్వహిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం RRR లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయనకు షూటింగ్ లో చిన్న గాయం అవ్వడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. సో రజిని తరువాత రామ్ చరణ్ కే అంతలా క్రేజ్ ఉందంట.

japan fans celebrates ram charan birthday:

Japan Fans Sweet Surprise for Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ