Advertisementt

‘రాజావారు రాణిగారు’ టైటిల్ అదిరిపోలా!

Tue 30th Apr 2019 12:19 AM
rajavaru ranigaru,poster,releaed,sl entertainment  ‘రాజావారు రాణిగారు’ టైటిల్ అదిరిపోలా!
S L Entertainment Movie Confirmed ‘రాజావారు రాణిగారు’ టైటిల్ అదిరిపోలా!
Advertisement
Ads by CJ

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో  ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది,  గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే..... ఒకసారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే.. లాంటి స్టేటస్ ల‌తో  RVRG హ్య‌ష్ ట్యాగ్ ల‌తో ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ ల‌తో యూత్ ని ఆక‌ట్టుకున్నారు ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు.. అంతేకాదు సోష‌ల్ మీడియాలో  RVRG పేరుతో ఈ మధ్య కొన్ని మినిమల్ పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి.. అసలు ఏంటి ఈ RVRG అనే స‌స్పెన్స్ ని  చిత్ర యూనిట్ ఈరోజు తెర‌దించ‌నుంది.  RVRG అంటే రాజావారు రాణిగారు అని తెలుపుతూ టైటిల్ పోస్టర్ని విడుదల చేసారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌నోవికాస్.డి మాట్లాడుతూ..  డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లో మూవీ ల‌వ‌ర్స్ బాగా ఎక్కువ‌య్యారు. సినిమా అప్‌డేట్స్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా చిత్ర యూనిట్ ముందుగా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది,  గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే..... ఒకసారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే.. అని స్టేట‌స్ లు పెట్టి, RVRG అనే ట్యాగ్ ని యాడ్ చేశాము. అయితే హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. అస‌లు RVRG అంటే ఏంట‌ని చాలా మంది అడ‌గ‌టం జ‌రిగింది. వీట‌న్నిటికి స‌మాధాన‌మే ఈ రోజు రివీల్ చేశాము.. ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, రహ‌స్య గోర‌ఖ్ లు జంట‌గా ర‌వికుమార్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ‘రాజా వారు రాణి గారు’ అని ఖ‌రారు చేశాము. ఈ చిత్రానికి జ‌య్ క్రిష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో  తెలియ‌జేస్తాం అని అన్నారు. 

S L Entertainment Movie Confirmed:

Rajavaru Ranigaru Poster Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ