Advertisementt

టాక్ బ్లాక్‌బస్టర్.. కానీ కొన్ని చోట్ల నష్టాలే!

Tue 30th Apr 2019 08:17 PM
jersey,nani,avengers endgame,hit talk,no collections,nani jersey  టాక్ బ్లాక్‌బస్టర్.. కానీ కొన్ని చోట్ల నష్టాలే!
Avengers Endgame Effect on Telugu Block Buster Movie టాక్ బ్లాక్‌బస్టర్.. కానీ కొన్ని చోట్ల నష్టాలే!
Advertisement
Ads by CJ

హీరో నాని లేటెస్ట్ సెన్సేషన్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతుంది. మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ 10రోజుల్లో అక్కడా 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది. సో.. దాంతో ఈ చిత్రం నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో ‘భలే భలే మగాడివోయ్’ 1.43 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఉంది.

అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం  ‘భలే భలే మగాడివోయ్’ వసూల్ ని క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. అక్కడ ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే. చాలా స్క్రీన్స్ లో ‘జెర్సీ’ సినిమా తీసేసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ వేశారంటే ‘జెర్సీ’ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఈ సినిమా పరిస్థితి మారింది. సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది అనుకుంటే కేవలం ఏ సెంటర్లలో మాత్రమే మంచి రన్ ను కనబరుస్తుంది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. వసూళ్ల విషయంలో డల్ అవ్వడం ఆశ్చర్యమే.

Avengers Endgame Effect on Telugu Block Buster Movie:

Jersey Hit.. But no Collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ