Advertisementt

వార‌ణాసిలో ఇస్మార్ట్ శంక‌ర్ ఫైట్

Tue 30th Apr 2019 10:19 PM
ismart shankar,puri jagannadh,charmi,ram,varanasi,fighting scene  వార‌ణాసిలో ఇస్మార్ట్ శంక‌ర్ ఫైట్
iSmart Shankar Action Episode in Varanasi వార‌ణాసిలో ఇస్మార్ట్ శంక‌ర్ ఫైట్
Advertisement
Ads by CJ

ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి (బుధవారం) నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు. సినిమా కీల‌క ఘ‌ట్టంలో ఈ యాక్ష‌న్ పార్ట్ ఉంటుంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హైద‌రాబాద్ నుండి సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి వెళుతున్నారు. పూరి స్ట‌యిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్ష‌న్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. 

లీడ్ పెయిర్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

iSmart Shankar Action Episode in Varanasi:

The shooting ‘iSmart Shankar’ will resume in the holy city, Varanasi from tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ