Advertisementt

ఇలాంటి గట్స్‌ మన స్టార్స్‌కి ఉన్నాయా?

Wed 01st May 2019 03:36 PM
big b amitabh bachchan,hijra role,kanchana,remake  ఇలాంటి గట్స్‌ మన స్టార్స్‌కి ఉన్నాయా?
Big B plays Hijra role in Kanchana Remake ఇలాంటి గట్స్‌ మన స్టార్స్‌కి ఉన్నాయా?
Advertisement
Ads by CJ

తమిళంలో రాఘవలారెన్స్‌ తీసిన ‘కాంచన’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి హీరోగా నటించిన లారెన్స్‌ కంటే ‘హిజ్రా పాత్రను పోషించిన శరత్‌కుమార్‌కి అద్భుతమైన పేరు వచ్చింది. ఈ పాత్ర గురించి పలు సందర్భాలలో శరత్‌కుమార్‌ చెప్పుకొచ్చాడు. తాను ఆ పాత్ర చేయకపోయి ఉంటే పెద్ద తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. నా భార్య రాధిక ఇప్పటివరకు నేను నటించిన ఏ చిత్రం గురించి, నా పాత్ర, నటన కూడా ప్రశంసలు ఇవ్వలేదు. కానీ ‘కాంచన’ చిత్రంలోని హిజ్రా పాత్రను చూసి మాత్రం ఆమె ఎంతో గర్వపడింది అని చెప్పుకొచ్చాడు. 

ఇక ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో లారెన్స్‌ రీమేక్‌ చేయనున్నాడు. లారెన్స్‌ పోషించిన పాత్రను అక్షయ్‌కుమార్‌ పోషిస్తుండగా, శరత్‌కుమార్‌ పోషించిన హిజ్రా పాత్రను బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్‌ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇంకా ఫైనల్‌ కాలేదు గానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలను చేశాడు. కానీ ఆయన ఇప్పటి వరకు హిజ్రాగా మాత్రం నటించలేదు. కానీ ప్రస్తుతం అలాంటి తరహా పాత్ర నటించే అవకాశం అమితాబ్‌ ముందుకు వచ్చింది. మరి దీనికి ఆయన ఎస్‌ చెబుతాడా? నో అంటాడా? అనేది చూడాలి. 

ఇక ఇటీవల తాజాగా విడుదలైన ‘కాంచన 3’ చిత్రం పూర్తి నెగటివ్‌ టాక్‌లో కూడా 100కోట్లను వసూలు చేసింది. ఫైనల్‌ రన్‌లో ఈ చిత్రం ఇంకా పెద్ద మొత్తంలోనే వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సందర్భంగా లారెన్స్‌ తాను కాంచన సిరీస్‌ను తీస్తూనే ఉంటానని హామీ ఇచ్చాడు. ఇక ‘కాంచన 4’ని అతి పెద్ద నిర్మాణ సంస్థ అయిన సన్‌ పిక్చర్స్‌ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 100కోట్ల బడ్జెట్‌ కేటాయించడానికి సన్‌ సంస్థ సంసిద్దత వ్యక్తం చేసిందట. ఈ సినిమాను 3డిలో రూపొందించాలని భావిస్తున్నారు. భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ని వాడుకోవాలని, మంచి పేరున్న క్యాస్టింగ్‌ను తీసుకోవడం కోసం 100కోట్లు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంపైనే లారెన్స్‌ పూర్తి ఏకాగ్రత పెట్టాడని తెలుస్తోంది. 

Big B plays Hijra role in Kanchana Remake:

Amitabh as Hijra in Kanchana?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ