‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క తనయుడు సాహస్ మొదటి జన్మదిన వేడుక ఇటీవల వనస్థలిపురంలోని అనన్య ఏకో రిసార్ట్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై సాహస్‌ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పిల్లల ఆట పాటలతో, సంగీత విభావరితో ప్రాంగణం హోరెత్తింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఓ కళ్యాణ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, నక్క ఉమేష్ కుమార్, సావిత్రి యాదవ్, నక్క శ్రీనివాస యాదవ్, సుకేసిని యాదవ్, సమ్మిని యాదవ్‌లతో పాటు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు.