మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు. ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పక్కా మాస్ మూవీతో వైష్ణవ్ తేజ్ వెండితెర అరంగేట్రం చెయ్యబోతున్నాడు. రంగస్థలంకు రైటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వతున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదకెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా రష్మికా మందన్నని ఎంపిక చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.
అయితే ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది.. అందుకే ఈ సినిమాకి జాలరి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా టాక్. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా లుక్ కూడా జాలరి వేషంలో ఉండడంతో.. ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని టీం భావిస్తోందట. అయితే ఈ టైటిల్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ఇక ఈ సినిమా కోసం తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ అవతారమెత్తుతున్నాడు. మరి ఈ కథలో ఎంత బలం లేకపోతే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి లాంటి హీరో వస్తున్నాడో అని ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న విషయం తెలిసిందే.