గతంలో నందమూరి తారకరామారావు, సూపర్‌స్టార్ కృష్ణ వంటి వారు స్టూడియో అధినేతలుగా, నిర్మాతలుగా, చివరకు దర్శకులుగా కూడా తమ సత్తా చాటుకున్నారు. ఈ మద్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘జానీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇక విషయానికి వస్తే మహేష్ తన నటనతో, అభిమానుల క్రేజ్, ఇమేజ్‌లలో తన తండ్రి సూపర్‌స్టార్‌కి అసలుసిసలైన తనయునిగా పేరు తెచ్చుకున్నాడు. తన అన్నయ్య రమేష్‌బాబు చేయలేని పనిని మహేష్ చేసి చూపిస్తున్నాడు. ఇప్పటికే మహేష్‌బాబు హీరోగా, నిర్మాతగా కూడా మారాడు. ఆయన నిర్మాతగా మారిన చిత్రాలు పెద్దగా లాభాలను అందించలేదు.
ఇక విషయానికి వస్తే తాజాగా జరిగిన ‘మహర్షి’ చిత్రం వేడుకలో హీరోయిన్ పూజాహెగ్డే మహేష్‌ని ఒక రేంజ్‌లో పొగిడేసి మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది. కానీ వాటిని నవ్వుతూ ఎంజాయ్ చేయకుండా అదే వేదికపై పూజాహెగ్డే సూచనను మహేష్ నిర్మొహమాటంగా కొట్టి పారేశాడు. పూజాహెగ్డే మాట్లాడుతూ, 25 సినిమాల అనుభవం ఉన్న మహేష్‌బాబు గారు మంచి దర్శకుడు కాగలరు. ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఆయన దర్శకుడు అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ ఆయన సన్నివేశాల గురించి చర్చించే విధానం, ప్రతి దానిని ఆయన చూసే కోణం ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడనిపించింది అని మాట్లాడింది.
దానికి మహేష్ సీరియస్‌గా కౌంటర్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఎవరి పనులు వారు చేస్తేనే బాగుంటుంది. నాకు దర్శకత్వంపై ఏమాత్రం ఆసక్తి లేదు... అని సమాధానం ఇచ్చాడు. అదే మహేష్, పూజాహెగ్డే మాటలను నవ్వుతూ తీసుకుని ఉంటే మహేష్ దర్శకుల పనిలో వేలు పెడతాడు అనే అనవసర కామెంట్స్ వచ్చేవి. దాంతోనే అదే వేదికపై ఆ విషయానికి మహేష్, పూజాహెగ్డే కోరికను సీరియస్‌గా తీసుకుని భవిష్యత్తులలో ఇలాంటి ప్రశ్నలు రాకుండా తేల్చిచెప్పాడు.