Advertisementt

పూజా 2 కోట్లు అడిగినా.. ఇచ్చేస్తున్నారు

Sat 04th May 2019 01:00 PM
pooja hegde,remuneration,varun tej,valmiki movie  పూజా 2 కోట్లు అడిగినా.. ఇచ్చేస్తున్నారు
Pooja Hegde Remuneration For Varun Tej Valmiki పూజా 2 కోట్లు అడిగినా.. ఇచ్చేస్తున్నారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది.. బాలీవుడ్ భామ పూజా హెగ్డే. బాలీవుడ్ లో ఫెయిల్ అయినా.. టాలీవుడ్ ని దున్నేస్తున్న ఈ భామ అందినంత పుచ్చుకోవడం లేదు. డిమాండ్ చేసి మరీ నిర్మాతలనుండి పారితోషకాన్ని పిండుతుంది. మహర్షి సినిమాలో హీరోయిన్.. ఆ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. మహేష్ పక్కన అంటే స్టార్ హీరోయిన్ రేంజ్. ఇక ప్రభాస్ పక్కన కూడా హీరోయిన్. అంతేనా తనని లక్కీ హీరోయిన్ గా మార్చిన అల్లు అర్జున్ పక్కన మరోసారి జోడి కడుతుంది. ఇక స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలతోనూ పూజా జోడి కట్టడానికి రెడీ అయ్యింది.

గతంలో వరుణ్ తేజ్ తో కలిసి ముకుంద సినిమాలో నటిస్తే.. తాజాగా వాల్మీకి సినిమాలో వరుణ్ సరసన నటించబోతుంది. ఇప్పటికే వాల్మీకి సెట్స్ లో జాయిన్ అయిన పూజా హెగ్డే... ఈ సినిమా కోసం భారీ పారితోషకం అందుకోబోతుందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ రీమేక్ గా ఈ వాల్మీకి సినిమా తెరకెక్కుతుంది. అధర్వ మురళి హీరోగా..  వరుణ్ తేజ్ నెగెటివ్ పాత్ర చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ముందు వేరే హీరోయిన్ అని అనుకున్న.. చివరికి పూజా అయితే వరుణ్ కి సెట్ అవుతుందని.. ఆమెని సంప్రదించగా... పూజా హెగ్డే ఏకంగా 15 రోజుల కాల్షీట్స్ కోసం 2 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ముందు దర్శకనిర్మాతలు షాకయినా... ఆమెకున్న క్రేజ్ కారణముగా పూజాకి 15 రోజుల డేట్స్ కోసం 2 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Pooja Hegde Remuneration For Varun Tej Valmiki:

Valmiki: 2 Cr For Star Attraction!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ