జోడి చిత్రం విషయంలో తలెత్తిన వివాదంపై గుర్రం విజయలక్ష్మి వివరణ ఇస్తూ: దర్శకుడు విశ్వనాథ్ ఉప్పలపాటి అనురాధను పరిచయం చేసాడు. నిర్మాతగా నాకు మంచి సినిమా నిర్మించాలనే కోరిక ఉన్నా నేను ఎక్కువగా అమెరికాలో ఉండటం జరుగుతుంది. ఇక్కడ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నాకు వెసులుబాటుగా ఉంటుందని ఉప్పలపాటి అనురాధా గారి భాగస్వామ్యంలో సినిమా నిర్మాణానికి నేను అంగీకరించాను. అనురాధా కుమారుడు చరణ్ తేజ్ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మడం జరిగింది. ఈ విషయంలో నేను చాలా షాక్ కి గురయ్యాను. నిర్మాణంలో మేజర్ షేర్ కలిగిన నా అనుమతి లేకుండా మోసం చేసి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మారు.
ఇప్పుడు సినిమా నిర్మాతలం మేమే అంటూ వారిచ్చిన కంప్లైట్ నిజంగా చాలా దారుణం. మోసం చేసిన వారే మోస పోయాం అంటూ ముసలి కన్నీళ్ళు, కార్చుతున్నారు. దొంగే .. దొంగ దొంగ అని అరిచనట్లు వీరి వ్యవహారం ఉంది. ఈ సినిమా విషయంలో అన్ని రుజువులు మా వద్ద ఉన్నాయి. మాకు తెలియకుండా సినిమా హక్కులను అమ్మడమే కాకుండా సినిమా వారిదే అంటూ వారిచ్చిన ఫిర్యాదుపై మేము న్యాయపోరాటానికి దిగబోతున్నాం. అన్నారు.
దర్శకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ: గుర్రం విజయలక్ష్మి గారికి ఉప్పలపాటి అనురాధా గారిని నేను పరిచయం చేసాను. సినిమా దర్శకుడిగా సినిమా నిర్మాతకు నష్టం వాటిల్లుతుంటే నేను చూస్తూ ఊరుకోను. సినిమా కంప్లీట్ కాకుండానే హిందీ డబ్బింగ్ రైట్స్ ని వాళ్ళు ఎవరికీ తెలియకుండా అమ్మేసారు. ఇంత మోసం చేస్తారని ఎవరూ ఊహించలేదు. విజయలక్ష్మి గారు విలువలతో బ్రతికే మనిషి. సినిమా పట్ల ఉన్న ప్యాషన్ తో ఈ రంగం వైపు అడుగు పెట్టారు. ఆమె ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే వారు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సినిమా పూర్తి అయి, ప్రమోషన్స్ ప్లాన్ లో ఉండగా ఈ వార్త మమ్మల్నికలచివేసింది. తప్పకుండా న్యాయ పోరాటం చేసి సినిమాని విడుదల చేస్తాం. అన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ మూవీలో ఆది, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, సత్య, వెన్నెల కిషోర్, సిద్దు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతీరావు వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ నటిస్తున్నారు.
భావనా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గుర్రం సమర్పణలో రాబోతున్న ఈ మూవీకి మ్యూజిక్ నీవే ఫేమ్ ఫణి కళ్యాణ్, ఎడిటింగ్: మండ్ల రవి, సినిమాటోగ్రఫి: ఎస్.వి. విశ్వేశ్వర్, దర్శకత్వం: విశ్వనాథ్ అరిగెల