Advertisementt

చివరికి మహేష్ రంగంలోకి దిగక తప్పలేదు

Mon 06th May 2019 03:41 PM
maharshi,producers,issues,mahesh babu,dil raju,pvp,ashwinidutt  చివరికి మహేష్ రంగంలోకి దిగక తప్పలేదు
Mahesh Babu Settled Maharshi Movie Producers Issues చివరికి మహేష్ రంగంలోకి దిగక తప్పలేదు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు కొత్త చిత్రం మహర్షి సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్నమొన్నటివరకు మహర్షి చిత్రం విషయంలో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మహర్షి సినిమాకి మొదటినుండి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిల మధ్యన ఏదో రగడ జరుగుతుందనే న్యూస్ వినబడుతూనే ఉంది. మొదట్లో పీవీపీ వలన గొడవ జరిగితే.. మధ్యలో దిల్ రాజు పెత్తనంతో పివిపి, అశ్వినీదత్ సఫర్ అవుతున్నారని అన్నారు. ఇక మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు అశ్వినీదత్‌కి దిల్ రాజుకి లాభాల్లో వాటాలపై తేడాలొచ్చాయని అన్నారు. అశ్వినీదత్ అసలేం పెట్టుబడి పెట్టకుండా 10 కోట్లు మాత్రం మహర్షి నుండి ఆశిస్తున్నాడని... కానీ దిల్ రాజు దానికి ఒప్పుకోవడం లేదని అన్నారు. 

అయితే సినిమా రిలీజ్ టైం లో ఈ వివాదాలు సినిమా మీద నెగెటివిటీని తెస్తాయని భావించిన మహేష్ రంగంలోకి దిగి అశ్వినీదత్ కి దిల్ రాజు కి మధ్యన ప్యాచప్ చేసాడని అంటున్నారు. అశ్వినీదత్ 10 కోట్లు డిమాండ్ చేస్తే... కాదు 7 కోట్లు తీసుకోమని.. అశ్వినీదత్ కి మహేష్ చెప్పడంతో గొడవ సర్దుమణిగిందని అంటున్నారు. అయితే మహేష్ మీద కునుకు వహించిన.. అశ్విని‌దత్ కూడా చివరికి సర్దుకుపోయాడని టాక్. 

ఇక అశ్వినీదత్ కి మహర్షి లాభాలకు ఎలాంటి సంబంధం ఉండదని... లాభమొచ్చినా, నష్టమొచ్చిన దిల్ రాజు, పివిపి లే చూసుకుంటారని అంటున్నారు. మరి సినిమా విడుదలకు ముందు గొడవలెందుకులే అని మహేష్ ఇలా చేసాడని అందుకే మహర్షి ఈవెంట్ కి ముగ్గురు నిర్మాతలు కలసి కట్టుగా వచ్చారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.  

Mahesh Babu Settled Maharshi Movie Producers Issues :

Mahesh Babu Takes final Decision on Producers Issues of Maharshi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ