Advertisementt

నటి సురేఖావాణి భర్త ఇక లేరు

Mon 06th May 2019 09:07 PM
surekha vani,husband,suresh,passess away  నటి సురేఖావాణి భర్త ఇక లేరు
Surekha Vani Husband is no more నటి సురేఖావాణి భర్త ఇక లేరు
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి సురేఖావాణి.. సోమవారం తన భర్తను కోల్పోయారు. దర్శకుడిగా ఎన్నో టీవీ షోలు చేసిన సురేష్ తేజను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఈ విషాదఘటన చోటు చేసుకోవడం బాధాకరం.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం బాధ తీవ్రతరం కావడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకా తెలియాల్సి ఉంది. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే వారిద్దరూ ప్రేమించి.. పెళ్లిచేసుకున్నారు. సురేశ్ తేజ డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలకు సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు సురేఖావాణికి ఫోన్ చేసి విషయం కనుక్కోవడమే కాకుండా.. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Surekha Vani Husband is no more:

Surekha Vani Husband Suresh Passess Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ