నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, వెన్నెల కిషోర్ కమెడియన్‌గా, సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న ‘మన్మథుడు2’ సినిమా షూటింగ్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పరిగెత్తిస్తున్నాడు. పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో ‘మన్మథుడు2’ మూవీ షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్న రాహుల్ రవీంద్రన్.. ఒక గెస్ట్ రోల్ కోసం సమంతని తీసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే మొదటి మన్మథుడు సినిమాలో వలే ఇద్దరు హీరోయిన్స్ ఈ ‘మన్మథుడు2’ లో కూడా ఉండబోతున్నారట. మన్మథుడు లో అన్షు, సోనాలి బింద్రే హీరోయిన్స్. దానికి సీక్వెల్ అంటే ఈ ‘మన్మథుడు2’ లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే. అయితే మధ్యలో సమంత ‘మన్మథుడు2’ లో నటిస్తుంది అనేసరికి సమంత సెకండ్ హీరోయిన్ అనుకున్నారు.
కానీ తాజాగా ‘మన్మథుడు2’ కోసం మరో హీరోయిన్ అవసరం ఉంటుందట. ఆ హీరోయిన్ అన్వేషణ జరుగుతుందట. ఆ హీరోయిన్ కోసమే చాలామందిని అనుకున్నారట కానీ.. మహానటి సావిత్రి పాత్రలో ఇరగదీసిన కీర్తి సురేష్ అయితే నాగార్జునకి సెట్ అవుతుందని.. ఆమెని సంప్రదించిందట ‘మన్మథుడు2’ టీం.
అయితే ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్తో ఖాళీ లేని కీర్తి సురేష్ డేట్స్ సర్దుబాటు అయితే తప్పకుండా ‘మన్మథుడు2’లో నటిస్తుందని చిత్ర బృందమే చెబుతుంది. ఇక కీర్తి సురేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ‘మన్మథుడు2’ టీం చూస్తుందట. మరి కీర్తి సురేష్ కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోగలిగితే.. ‘మన్మథుడు2’లో నాగ్ సరసన కీర్తి సురేష్‌ని చూడొచ్చన్నమాట.