Advertisementt

అనసూయకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా?

Tue 07th May 2019 06:21 PM
chiranjeevi,chiru 152 film,anasuya,koratala siva,importance role  అనసూయకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా?
Anasuya Key Role in Koratala and Chiru Combo film అనసూయకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా?
Advertisement
Ads by CJ

చిరు-కొరటాల శివ సినిమా ఈ జూన్ నుండి కానీ ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసుకుని కూర్చున్న కొరటాల శివ ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ దగ్గరనుండి సినిమాలో నటించే నటీనటుల ఎంపిక చేపట్టాడనే న్యూస్ ఉంది. ఇక చిరు సరసన ఇంకా హీరోయిన్‌ని అయితే ఫైనల్ చెయ్యలేదు కానీ.. ఈ సినిమాలో మరో కీ రోల్ ప్లే చేయబోతున్న అనసూయ విషయం మాత్రం సోషల్ మీడియాలో కథలు కథలుగా వినబడుతుంది. అనసూయ.. చిరు - కొరటాల శివ మూవీలో ఓ కీలక పాత్ర చేయబోతోందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం వంటి సినిమాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నిరూపించుకున్న అనసూయ ఇపుడు చిరు సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుందో అనే క్యూరియాసిటీ మొదలైంది.

ఇక ఈ సినిమా కోసం అక్షరాలా 25 లక్షలు అందుకుంటున్న అనసూయ... ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన పాత్రను చేయబోతుందనేది లేటెస్ట్ న్యూస్. చిరు - కొరటాల సినిమాలో అనసూయకు హీరోయిన్‌తో సమానమైన పాత్రను ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ కూడా అనసూయ పాత్రను సరికొత్తగా డిజైన్ చేసినట్టు సమాచారం. మరి రంగస్థలం సినిమాలో రంగమ్మత్తలాంటి మరో పాత్ర అనసూయకి పడితే ఆమె కెరీర్ లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఎంత కీలకమో కొరటాల శివ - చిరు సినిమాలో అనసూయ పాత్ర అంతే కీలకమంటూ ప్రచారమైతే జోరుగా జరుగుతుంది.

Anasuya Key Role in Koratala and Chiru Combo film:

Anasuya gets Important Role in Chiru 152 Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ