Advertisementt

పవన్, ప్రభాసే వారి విజయానికి కారణం!

Tue 07th May 2019 06:38 PM
world dancing finale,the kings,pawan kalyan,prabhas,baahubali,sardhaar gabbar singh,winners  పవన్, ప్రభాసే వారి విజయానికి కారణం!
Sardaar Gabbar Singh Song At World Of Dance Finale పవన్, ప్రభాసే వారి విజయానికి కారణం!
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ చిత్రం సాధించిన విజయం గురించి బాలీవుడ్‌లో భారీ లెవల్లో చర్చలే జరిగాయి, జరుగుతున్నాయంటే.. ఎంతగా బాహుబలి ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్ కల్యాణ్ ప్లాప్ సినిమా కూడా 50 కోట్లు ఈజీగా సాధిస్తుందంటే, అతనికున్న క్రేజ్ అలాంటిది. ఆయన నటించిన ‘సర్థార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ప్లాపయినా 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి పవన్ కల్యాణ్‌ స్థాయిని తెలియజేసింది. ఇప్పుడిదే బాహుబలి, సర్థార్ గబ్బర్‌సింగ్ చిత్రాలలోని సంగీతంతో ముంబైకి చెందిన‌ ఓ డ్యాన్స్ గ్రూప్ విజేత‌గా నిలిచి.. ఈ రెండు చిత్రాలు మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

‘వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్‌’ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్స్ రియాలిటీ షోలో ముంబైకి చెందిన‌ డ్యాన్స్ గ్రూప్ ‘ది కింగ్స్‌’ విజేత‌గా నిలిచింది. వీరి విజయానికి కారణం బాహుబలి ఫైటింగ్ బీజియమ్, సర్థార్ గబ్బర్‌సింగ్ చిత్రంలోని ‘ఆడెవడన్నా.. ఈడెవడన్నా’ పాటలోని మ్యూజిక్‌. ఈ రెంటిని మిక్స్ చేసి.. వారు చేసిన అభినయానికి ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు జెన్నీఫ‌ర్ లోపేజ్‌, నీయో, డెరెక్ హూగ్.. వారినే విజేతలుగా ప్రకటించారు. దీంతో వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ అవార్డ్ ప్రైజ్ వారి వశమైంది. ఈ వీడియోను వ‌రల్డ్ ఆఫ్ డ్యాన్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్, ప్రభాస్‌ల వల్లే వారు విజయం సాధించారని అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

‘ది కింగ్స్‌’ సాధించిన ఈ విజయంపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా సంతోషిస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నా సంగీతం ప్ర‌జ‌ల్ని డ్యాన్స్ చేయించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఎంతో చ‌క్క‌గా డ్యాన్స్ చేశారు. కీప్ రా‘కింగ్స్‌’.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులే లేవు.

Click Here for Video

Sardaar Gabbar Singh Song At World Of Dance Finale:

Pawan and Prabhas Movie Music at World Dancing Finale

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ