తమిళనాట అప్పుడెప్పుడో.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో ఇద్దరు స్టార్స్ కలిసి చేస్తున్నారని.. అందులో వెంకటేష్, రానా అని ఒకసారి.. తర్వాత బాలకృష్ణ అని.. తాజాగా వెంకటేష్, నారా రోహిత్ లు ఈ విక్రమ్ వేద సినిమాని రీమేక్ చేయబోతున్నట్లుగా నిన్న సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక న్యూస్ భలే చక్కర్లు కొట్టింది. తమిళనాట యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ గాయత్రి తెరక్కించిన ఈ సినిమా అక్కడ కోట్ల వర్షం కురిపించింది. అలాంటి సినిమాని తెలుగు హీరోలెవరు ముందుకొచ్చి రీమేక్ చేస్తారో కానీ... ఆ సినిమాలో వీళ్ళే నటిస్తున్నారు అంటూ నెలకో న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
తాజాగా నారా రోహిత్, వెంకటేష్ కలిసి వి వి వినాయక్ దర్శకత్వలో ఈ తమిళ విక్రమ్ వేదాని రీమేక్ చేయబోతున్నట్లుగా.. పాపం వినాయక్ రేంజ్ ఇలా రీమేక్ లకు పడిపోయింది అంటూ అబ్బో చాలానే న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.
తాజాగా వెంకటేష్ ఈ విక్రమ్ వేద సినిమాని రీమేక్ చెయ్యడం లేదని.. సురేష్ ప్రొడక్షన్ నుండి క్లారిటీ వచ్చింది. విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని.. క్లారిటీ ఇచ్చియాన్ సురేష్ ప్రొడక్షన్స్.. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ షూటింగ్ లో బిజీగా వున్నారని... త్వరలోనే వెంకీ తదుపరి చిత్రాలను ప్రకటిస్తామని ఈ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.