విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కొలైగారన్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా కథానాయిక. దియా మూవీస్ ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించింది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. జూన్ తొలివారంలో సినిమా రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. విజయ్ ఆంటోని.. యాక్షన్ కింగ్ అర్జున్ పోటాపోటీగా నటించే చిత్రమిదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైమన్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వెర్షన్ నిర్మాతలు టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ జోనర్‌లో యూనిక్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్‌తో రక్తి కట్టిస్తుంది. అర్జున్ నటన సినిమాకే హైలైట్. విజయ్ ఆంటోని పాత్ర ఏమిటి అన్నది ఇప్పటికి సస్పెన్స్. తెలుగు వెర్షన్ నాణ్యతతో చేస్తున్నాం. అన్ని వర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. ఇటీవలే దుబాయ్‌లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలతో చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే రెండవ వారంలో ట్రైలర్ విడుదల చేస్తున్నాం. రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
అర్జున్, విజయ్ ఆంథోని, అషిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి: మాటలు, పాటలు: భాష్యశ్రీ, సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, ఆర్ట్: వినోద్ రాజ్ కుమార్, నిర్మాతలు: టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్, రచన- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.