Advertisementt

‘మన్మథుడు 2’ హీరోయిన్లతో ప్లాష్ బ్యాక్!

Wed 08th May 2019 07:11 PM
manmadhudu 2,nagarjuna,heroines,flash back,rakul preet singh,rahul ravindran  ‘మన్మథుడు 2’ హీరోయిన్లతో ప్లాష్ బ్యాక్!
Flash Back Episode for Heroines in Manmadhudu 2 ‘మన్మథుడు 2’ హీరోయిన్లతో ప్లాష్ బ్యాక్!
Advertisement
Ads by CJ

మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా మన్మథుడు 2 ని నాగార్జున, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మన్మథుడు సినిమా నాగార్జున కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్. త్రివిక్రమ్ మాటలందించిన ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ లో నాగార్జున అమ్మాయిలు వెంటపడే ఆకతాయి కుర్రాడిలా, రిచ్చెస్ట్ పర్సన్ లా.. అలాగే ప్రజంట్ లో అమ్మాయిలంటేనే చిరాకు పడి ఆమడ దూరం ఉండే వ్యక్తిగా.... చివరికి ఆఫీస్‌లో పనిచేసే సోనాలి బింద్రేని ప్రేమించి పెళ్లాడినట్లుగా దర్శకుడు కథ నడిపించాడు. మధ్యలో కామెడీ అర్ధవంతంగా పండించడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా రాహుల్ కూడా కామెడీకి పెద్ద పీట వేస్తూ నాగ్ కి తోడుగా రంగంలోకి వెన్నెల కిషోర్ ని దింపాడు. ఇక మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో ఇప్పటికే సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తుండగా.. ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ కోసం మరో హీరోయిన్ బెంగళూరు క్యూట్ గర్ల్ అక్షర గౌడ ని తీసుకున్నారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా మన్మథుడు 2 లో అతిధి పాత్రలో మెరవబోతుంది. అయితే ఇంతమంది హీరోయిన్స్ ని గెస్ట్ రోల్స్ కి రాహుల్ రవీంద్రన్ ఎంపిక చెయ్యడానికి ఒక కారణముందట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్ అంటే ప్రజంట్లో కనబడే హీరోయిన్ అయితే... సమంత, అక్షర గౌడ్, కీర్తి సురేష్ లు ఫ్లాష్ బ్యాగ్ కోసం తీసుకున్నారట. మరి అతిథి పాత్రలంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోకుండా ఒక్కో హీరోయిన్ కి ఒక పది నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉండేలా రాహుల్ ఆ హీరోయిన్స్ కేరెక్టర్స్ ని డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి నాగార్జున ఈ హీరోయిన్స్ అందరితో ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి ప్రేమాయణాన్ని నడిపించాడో చూడాలి.

Flash Back Episode for Heroines in Manmadhudu 2:

Manmadhudu 2 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ