Advertisementt

‘మహర్షి’ ఫస్ట్ టాక్ (ప్రీమియర్) వచ్చేసింది..!

Thu 09th May 2019 12:19 AM
maharshi,premiere talk,mahesh babu,maharshi first talk,maharshi review,maharshi first review,maharshi report  ‘మహర్షి’ ఫస్ట్ టాక్ (ప్రీమియర్) వచ్చేసింది..!
Mahesh Babu Maharshi Movie Premiere Talk ‘మహర్షి’ ఫస్ట్ టాక్ (ప్రీమియర్) వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

మరో కొన్ని గంటల్లో మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీ మహర్షి రిలీజ్ అవ్వబోతుంది. సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుండే దీనిపై అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. అయితే సినిమా టాక్ ఏంటి? స్టోరీ ఏంటి? అన్న ఆసక్తి అభిమానుల్లో అంతకంతకూ పెరుగుతూనే వుంది.

అయితే నిన్న(మంగళవారం) ఇండస్ట్రీలో చాలా దగ్గర వాళ్లకి మహర్షి ప్రీమియర్ షో వేసారట. ఇన్సైడర్స్ నుంచి వస్తున్న ‘వెరీ ఫస్ట్ టాక్’ ఫ్యాన్స్‌కి కొంతమేరకు రిలీఫ్ నిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందని.. ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా బాగా తీసాడని చెబుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ కి ఇది ఐ ఫీస్ట్ అని చెబుతున్నారు. కాలేజ్ స్టూడెంట్ రోల్‌కి సంబంధించిన ఎపిసోడ్ మహేష్ కెరీర్లోనే ‘ది బెస్ట్’ అని చెబుతున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ కానీ ఎనర్జీ లాంటి హీరోయిక్ ఎలిమెంట్స్‌లో అతడు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్స్‌ని గుర్తు చేస్తోందట. 

సెకండ్ హాఫ్ మొత్తం మహేష్ నటవిశ్వరూపం చూపుతాడని చెబుతున్నారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ ఉండడంతో సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు. సినిమా స్టార్టింగే అమెరికాలో ప్రారంభం అవుతుందని, సీఈఓ పాత్రలో రిషిగా మహేష్, అతడి సెక్రటరీ పాత్రలో మీనాక్షి దీక్షిత్ కనిపిస్తుందని చెబుతున్నారు. కొన్ని కారణాలు వల్ల నరేష్ కోసం ఓ గ్రామానికొచ్చి అక్కడ రైతుల సమస్యలు గురించి పోరాడతాడని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో కొన్ని గంటల్లోనే తెలియనుంది. నరేష్ - మహేష్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని, ప్రతి ఒక్కరినీ వీరి మధ్య వచ్చే ఓ సన్నివేశం కన్నీళ్లు పెట్టిస్తుందని టాక్ నడుస్తోంది.

Mahesh Babu Maharshi Movie Premiere Talk:

Maharshi Movie Premiere Talk Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ