ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు సడెన్‌గా సైడ్ క్యారెక్టర్లు చేయాలంటే ఎవరికైనా చాలా కష్టం. మరీ కెరీర్ పరంగా స్లో గా ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తే పర్లేదు. అలా కాదని హీరోగా మంచి లీడ్ చేస్తున్న టైములో ఇటువంటివి చేస్తే కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇది తెలుసుకున్న సునీల్ ఆల్రెడీ సైడ్ క్యారెక్టర్లకు, హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తున్నాడు. సునీల్ తరువాత అలా అల్లరోడు చేస్తున్నాడు.
కమెడియన్ నుండి హీరోగా మారి చివరికి హీరోగా అతని సక్సెస్ రేట్ చూసుకున్న సునీల్.. ఇక హీరోగా కరెక్ట్ కాదని తెలుసుకుని మళ్లీ కామెడీ పాత్రలు చేసుకుంటున్నాడు. సునీల్ లేటెస్ట్ గా అరవింద సమేతలో ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా నటించాడు. ఆ తరువాత చిత్రలహరి సినిమాలో.. ఇలా కామెడీ పాత్రలు చేయడం కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాడు. సో ఇలా చేస్తున్నందుకు సునీల్ హ్యాపీ. మరీ అల్లరి నరేష్ పరిస్థితి ఏంటి?
అల్లరి నరేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. హీరోగా వరసగా ఫ్లాపులు వస్తున్న వేళ, వంశీ పైడిపల్లి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పేసరికి ఒప్పుకున్నాడు. పైగా మహేష్ బాబుతో సినిమా కాబట్టి వెంటనే ఓకే చెప్పేసాడు. ఈసినిమాతో అర్థం అవుతుంది నరేష్ హీరోగా కంటిన్యూ అవ్వాలా లేదా క్యారెక్టర్ రోల్స్ చేయాలా అనే విషయం. చూద్దాం ఏమౌతుందో?