Advertisementt

అప్పుడు సిల్క్ స్మితగా.. ఇప్పుడు..?

Thu 09th May 2019 06:48 PM
vidya balan,sakunthala devi,biopic,silksmitha,dirty picture  అప్పుడు సిల్క్ స్మితగా.. ఇప్పుడు..?
Vidya Balan Signs One More Biopic అప్పుడు సిల్క్ స్మితగా.. ఇప్పుడు..?
Advertisement
Ads by CJ

నటి విద్యాబాలన్ కి బియోపిక్స్ ఏమి కొత్త కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్ర చేసిన ఈమె ఇప్పుడు మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఈసారి వెండితెరకు సంబందించిన వాళ్ళ గురించి కాదు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి బయోపిక్ లో నటించేందుకు విద్యా ఓకే చెప్పింది. శకుంతలాదేవిని హ్యూమన్  కంప్యూటర్ అని అంటారు. ఎంత పెద్ద లెక్క అయినా ఆమె ఇట్టే సాల్వ్ చేసేది అని పేరు ఉంది. గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కిన శకుంతలాదేవిపై బయోపిక్ రానుంది.

దర్శకులు అను మీనన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారు. కథ విన్న వెంటనే విద్యా బాలన్ ఒప్పుకుందట. 2020 వేసవికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాను విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

Vidya Balan Signs One More Biopic:

Vidya Balan in Sakunthala Devi Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ