Advertisementt

ఈ దెబ్బతో లిప్‌లాక్స్‌లో రికార్డ్ కొట్టేస్తాడేమో..?

Thu 09th May 2019 07:48 PM
vijay deverakonda,kranthi madhav,movie,liplock scene,2 mins  ఈ దెబ్బతో లిప్‌లాక్స్‌లో రికార్డ్ కొట్టేస్తాడేమో..?
2 Min liplock Scene in Vijay Deverakonda and Kranthi Madhav Film ఈ దెబ్బతో లిప్‌లాక్స్‌లో రికార్డ్ కొట్టేస్తాడేమో..?
Advertisement
Ads by CJ

నటుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే అతని సినిమాల్లో మనకు ముందుగా గుర్తు వచ్చేది లిప్‌లాకులు. అర్జున్ రెడ్డి సినిమాలో మనోడు లిప్ కిస్ సీన్స్ సీన్స్ టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇక అప్పటినుండి టాలీవుడ్ లో లిప్ లాక్ లేని సినిమాలు రావడంలేదు.  అందుకే మనోడికి టాలీవుడ్ ఇమ్రాన్ హాష్మి అనే పేరు కూడా ఉంది. సో విజయ్ సినిమాల్లో లిప్‌లాకులు కామన్ అయిపోయాయి.

విజయ్ లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ లో రష్మికతో లిప్ లాక్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. అలానే విజయ్ మరో కొత్త మూవీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో కూడా లిప్ లాక్ ఉందట. ఇందులో పెద్ద విషయం ఏముంది విజయ్ సినిమాల్లో ఇవి ఇప్పుడు కామన్ అయిపోయాయి కదా అంటారా?

అయితే ఈసారి విజయ్ లిప్ కిస్సుల్లో కూడా కొత్తదనం చూపించనున్నాడట. ఈ సినిమాలో ఏకంగా రెండు నిముషాల పాటూ సా..గే సుదీర్ఘమైన లిప్పు కిస్సును పెట్టారట. ఈ కిస్సు ఎంతో కళాత్మకంగా.. ఆడియన్స్ కు అర్జున్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా ఉంటుందని  టాక్ వినిపిస్తోంది. అయితే మరి ఆ లిప్ లాక్ ను అందుకున్న ఆ అమ్మడు ఎవరో మాత్రం తెలియదు. ఇందులో రాశిఖన్నాతో మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు అని టాక్ ఉంది. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనేది క్లారిటీ లేదు. సో మరి వీరిలో ఆ అదృష్టం ఎవరికి వరించిందో వేచిచూడాలి.

2 Min liplock Scene in Vijay Deverakonda and Kranthi Madhav Film:

Vijay Deverakonda and Kranthi Madhav Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ